Asianet News TeluguAsianet News Telugu

Australia vs Pakistan: సెంచ‌రీ మిస్.. మిచెల్ మార్ష్‌ హార్ట్ బ్రేక్..

Mitchell Marsh: మిచెల్ మార్ష్ మ‌రో సెంచ‌రీని మిస్ అయ్యాడు. మెల్బోర్న్ లో పాకిస్థాన్ తో జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ 16/4తో పీక‌ల్లోతూ క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో బ్యాటింగ్ కు వచ్చిన మిచెల్ మార్ష్ 96 (130) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
 

Australia vs Pakistan Test: Mitchell Marsh misses out on well deserved hundred RMA
Author
First Published Dec 28, 2023, 2:49 PM IST

Mitchell Marsh misses out on well deserved hundred: మెల్బోర్న్  వేదిక‌గా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ‌ధ్య బాక్సింగ్ డే టెస్టు జ‌రుగుతోంది. అయితే, ఆసీస్ ప్లేయ‌ర్ మిచెల్ మార్ష్ నాలుగు ప‌రుగులు దూరంలో సెంచ‌రీని మిస్ అయ్యాడు. అయితే, అత‌ను ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చ‌రిత్ర‌లో గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 16 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో బ్యాటింగ్ కు వ‌చ్చిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ మిచెల్ మార్ష్ ఎదురుదాడికి దిగాడు. త‌న అద్భుత‌మైన ఆట తీరుతో 96 ప‌రుగుల‌తో రాణించాడు. స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ తో కలిసి 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

మార్ష్ స్ట్రోక్ ప్లే చాకచక్యానికి, శక్తికి ప్రతీకగా నిలిచే ఇన్నింగ్స్ ఇది. సూప‌ర్బ్ షాట్లను ప్రదర్శించి స్కోరుబోర్డును ప‌రుగులు పెట్టించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అతని సంయమనం, ఆడిన తీరు ప్రశంసనీయం. మ‌రో నాలుగు ప‌రుగులు చేసివుంటే సూప‌ర్ సెంచ‌రీ కొట్టివుండే వాడు. ఇక సెంచ‌రీ మిస్ కావ‌డంపై అభిమానులు నిరాశ‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

నిరాశ‌లో మార్ష్ కుటుంబం.. 

పాకిస్థాన్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ సెంచరీని చేజార్చుకోవడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 153 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని విడిగొడుతూ.. పాక్ లెఫ్టార్మ్ పేసర్ మీర్ హమ్జా బౌలింగ్ లో మార్ష్ 96 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మార్ష్ ఔట్ అయిన వెంట‌నే ఈ మ్యాచ్ చూడ‌టానికి వ‌చ్చిన మిచెల్ మార్ష్ కుటుంబం.. అత‌ను ఔట్ అయిన వెంట‌నే నిరాశ‌కు గుర‌య్యారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. 

 

INDW VS AUSW: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. బ్యాటింగ్ కు దిగిన భారత్ మ‌రో చ‌రిత్ర సృష్టిస్తుందా?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios