Australia vs Pakistan: జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ విధ్వంసం.. పీకల్లోతు కష్టాల్లో పాకిస్తాన్
Australia vs Pakistan Test : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో పాకిస్తాన్ పీకల్లోతూ కష్టాల్లో పడింది. జోష్ హేజిల్‌వుడ్ దెబ్బకు పాకిస్తాన్ టాపార్డర్ తోకముడిచింది. పాక్ 68 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.
Josh Hazlewood: సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మూడో టెస్టు మ్యాచ్ లో కంగారుల జట్టు పట్టుబిగిస్తోంది. ఆసీస్ బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటర్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. టెస్టు మూడో రోజు పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ పాక్ ను దెబ్బకొట్టాడు. దీంతో మ్యాచ్ దాదాపు పూర్తిగా ఆస్ట్రేలియాకు చేతిలోకి వెళ్లిపోయింది. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ లో జోష్ హేజిల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. 68 పరుగులకే పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
జోష్ హేజిల్‌వుడ్ దెబ్బకు పాకిస్తాన్ టాపార్డర్ తోకముడిచింది. వరుస వికెట్లు కోలపోవడంతో పాక్ 68 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. జోష్ హేజిల్‌వుడ్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో రెండు ఒవర్లు మేడిన్ కావడం విశేషం. ఒక ఓవర్ ఐదు బంతుల్లోనే హేజిల్ వుడ్ 3 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం పాక్ బ్యాటర్స్ మహ్మద్ రిజ్వాన్, అమీర్ జమాల్ లు క్రీజులో ఉన్నారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తన మొత్తం ఆధిక్యాన్ని 82 పరుగులకు పెంచుకుంది. మహ్మద్ రిజ్వాన్, అమీర్ జమాల్ పాకిస్థాన్‌ను మరోసారి రక్షించేందుకు పోరాడుతున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 313 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా 299 పరుగులకు ఆలౌట్ అయింది.