ఆస్ట్రేలియాపై జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మీద నెటిజన్లు మండిపడుతున్నారు. అతను రెండుసార్లు క్యాచ్ జారవిడిచారు. దీనిపై నెటిజన్లు పంత్ ను ట్రోల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. టాస్ గెలిచి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో కేవలం ఐదు పరుగులకే ఓపెనర్ డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. ఆ తర్ాత లబుషేన్, విల్ పకోవిస్కీ ఇన్నింగ్సును గాడిలో పెట్టే ప్రయత్న చేశారు. అయితే, పకోవిస్కీని అవుట్ చేసే అవకాశాన్ని రిషబ్ పంత్ రెండు సార్లు జారవిడుచుకున్నాడు. 

22వ ఓవరులో అశ్విన్ బౌలింగ్ లో ఓసారి, 25వ ఓవరులో సిరాజ్ బౌలింగ్ మరోసారి రిషబ్ పంత్ క్యాచ్ లను జారవిడిచాడు. దీంతో పకోవిస్కీకి రెండు సార్లు లైఫ్ వచ్చింది. దీంతో రిషబ్ పంత్ కీపింగ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

పంత్ కు బదులు వృద్ధిమాన్ సాహాను తుది జట్టులోకి తీసుకున్నా బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. పంత్ టీమిండియా గిల్ క్రిస్ట్ అంతటివాడయ్యేవాడని, అదే సమయంలో అతను ఇండియా కమ్రాన్ అక్మల్ కూడా కాలగలడని వ్యాఖ్యానించారు. ఏంటిది పంత్, ఎందికిలా చేశావని అడుగుతున్నారు. 

 

ఇదిలావుంటే, అర్థ సెంచరీ చేసిన పకోవిస్కీని ఎట్టకేలకు సైనీ అవుట్ చేశాడు. 34వ ఓవరులో ఎల్బీడబ్ల్యుగా అతను వెనుదిరిగాడు. గురువారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబూషేన్, స్టీవ్ స్మిత్ క్రీజులో ఉన్నారు.