భారత జట్టు చేతిలో స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడిన ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌ను నెటిజన్లు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఆఖరి టెస్టులో ఏ మాత్రం అనుభవం లేని భారత బౌలింగ్‌ విభాగం, 1000 వికెట్ల కంటే ఎక్కువ అనుభవం ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం కంటే మెరుగ్గా రాణించింది.

సిడ్నీ టెస్టులో ‘గబ్బా టెస్టు’ గురించి గర్వంగా టిమ్ పైన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. టీమిండియాతో టెస్టు సిరీస్‌ను ముగించుకున్న టిమ్ పైన్... బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొంటున్నాడు. హోబర్ట్ హరికేన్స్‌ తరుపున బరిలో దిగిన టిమ్ పైన్... బ్రేక్ సమయంలో వాటర్ బాయ్‌లా మారాడు. అయితే వాటర్ బాయ్‌గా టిమ్‌పైన్‌ను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

‘వాటర్ బాయ్‌గా మారిన టిమ్ పైన్... వాటర్‌ను కూడా పడేస్తాడేమో..’ అని కొందరూ, ‘టెస్టు సిరీస్‌లో కూడా పైన్ చేసింది ఇదేలే’ అంటూ ఇంకొందరు ఆసీస్ కెప్టెన్‌ను విపరీతంగా ఆడేసుకుంటున్నారు. భారత్ చేతిలో టీమిండియా ఓటమి తర్వాత ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ను మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.