ఆస్ట్రేలియా క్రికెటర్లను బాల్ ట్యాపరింగ్ వివాదం   ఇంకా వెంటాడుతూనే వుంది. గతంలో క్రీడాస్పూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించి బంతి ఆకారాన్ని మార్చి విజయాన్ని పొందాలని భావించిన ఆసిసి సీనియర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లు అడ్డంగా బుక్కైన విషయం  తెలిసిందే. దీంతో వీరు ఏడాదికాలంపాటు నిషేధాన్ని ఎదుర్కొని ఇటీవలే ప్రపంచ కప్ ద్వారా మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసి అదరగొట్టారు. అయితే ఇలా చేసిన తప్పు  చేసినందుకు  కఠిన శిక్ష అనుభవించినా వారికింకా చేధు అనుభవాలే ఎదురవుతున్నాయి. అభిమానుల నుండి మాత్రం వారు ఇంకా చీత్కారాలు ఎదుర్కొంటూనే వున్నారు.  

ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత అదే ఇంగ్లాండ్ గడ్డపై ఆసిస్ ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ ఆడుతోంది. ఇందులో భాగంగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్-ఆసిస్ లు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఇంగ్లాండ్ అభిమానులు మాత్రం మ్యాచ్ ను ఆస్వాదించకుండా వార్నర్, స్మిత్, బాన్ క్రాప్ట్ లను ఎగతాళి చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా బాల్ ట్యాపరింగ్ వివాదాన్ని గుర్తుచేస్తూ మైదానంలోనే సాండ్ పేపర్లను ప్రదర్శిస్తున్నారు. అంతటితో   ఆగకుండా వారిపై అవమానించేవిధంగా నినాదాలు చేస్తున్నారు. 

మొదటి రోజు నుండి ఇంగ్లాండ్ అభిమానుల నుండి అవమానాలను ఎదుర్కొంటున్న వార్నర్ తాజాగా వినూత్నరీతిలో వారికి జవాభిచ్చాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా వార్నర్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. దీంతో అతన్ని ఉద్దేశిస్తూ ఇంగ్లీష్ అభిమానులు కామెంట్స్ చేయడం ఆరంభించారు. ''ఈ మ్యాచ్ కు కూడా సాండ్ పేపర్ తీసుకొచ్చారా....ట్యాంపరింగ్ ద్వారానే గెలవాలనుకుంటున్నారా...'' అంటూ వార్నర్ కు వినబడేలా అరవడం ప్రారంభించారు. ఈ కామెంట్స్ ని సరదాగా తీసుకున్న వార్నర్ కేవలం సైగలతోనే వారికి సమాధానమిచ్చాడు. 

వార్నర్ ఖాళీగా వున్న రెండు చేతులను  అభిమానులకు చూపించాడు. అంతేకాకుండా ప్యాంట్ జేబులను బయటకు లాగి చూపించాడు. ఇలా తనవద్ద ఎలాంటి సాండ్ పేపర్స్ లేవు. ఇక మీరు నోరు మూసుకుంటారా..? అన్నట్లు కేవలం సైగలతోనే వార్నర్ ఇంగ్లాండ్ అభిమానుల నోరు మూయించాడు. ఇలా వార్నర్ సరదాగానే ఇంగ్లాండ్ అభిమానులకు ధీటుగా జవాభిచ్చాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I LOVE HIM 😍 #Ashes

A post shared by Aussie Aussie Aussie 🇦🇺🇦🇺 (@63notout.forever) on Aug 3, 2019 at 7:26am PDT