Asianet News TeluguAsianet News Telugu

రిటైర్మెంట్ ప్రకటించిన ఆరోన్ ఫించ్... టీ20ల నుంచి కూడా తప్పుకుంటూ నిర్ణయం! ఆసీస్ కొత్త కెప్టెన్‌గా...

2022 సెప్టెంబర్‌లో వన్డేల నుంచి తప్పుకున్న ఆరోన్ ఫించ్... తాజాగా టీ20ల నుంచి తప్పుకుంటూ నిర్ణయం... కొత్త టీ20 కెప్టెన్ వెతికే పనిలో ఆస్ట్రేలియా... 

Australia Captain Aaron Finch announced retirement for International cricket, t20 world cup 2024 cra
Author
First Published Feb 7, 2023, 9:34 AM IST

ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో వన్డేల నుంచి తప్పుకున్న ఆరోన్ ఫించ్, టీ20ల్లో మాత్రం కొనసాగుతూ వచ్చాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత జరిగిన మ్యాచుల్లోనూ బ్యాటర్‌గా ఫెయిల్ అవుతూ వచ్చిన ఆరోన్ ఫించ్... పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నాడు...

ఆరోన్ ఫించ్ వన్డేల నుంచి తప్పుకున్న తర్వాత టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, వన్డేలకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. మరి టీ20లకు అతన్నే సారథిగా నియమిస్తారా? లేక కొత్త కెప్టెన్‌ని ప్రకటిస్తారా? అనేది క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది...

ఆస్ట్రేలియా తరుపున 76 టీ20 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆరోన్ ఫించ్, 2021 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీని గెలిచాడు. 55 వన్డేలకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించిన ఆరోన్ ఫించ్, తన కెరీర్‌లో 5 టెస్టులు, 146 వన్డేలు, 103 టీ20 మ్యాచులు ఆడాడు... 

వన్డేల్లో 17 సెంచరీలు బాదిన ఆరోన్ ఫించ్, 2011 జనవరిలో ఇంగ్లాండ్‌పై టీ20 ఆరంగ్రేటం చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో రెండు సెంచరీలతో 8,804 అంతర్జాతీయ పరుగులు చేశాడు.

‘2024 టీ20 వరల్డ్ కప్ వరకూ నేను ఆడలేను, ఆ విషయాన్ని ఎప్పుడో గ్రహించాను. అందుకే ఆ టోర్నీకల్లా కొత్త కెప్టెన్‌కి టీమ్‌కి రెఢీ చేసే సమయం ఇవ్వాలనే ఉద్దేశంలో రిటైర్మెంట్ తీసుకుంటున్నా...  నా ఈ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులకు, ప్రతీ ఒక్కటికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా...’ అంటూ తన రిటైర్మెంట్ స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చాడు ఆరోన్ ఫించ్...

2018లో జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 76 బంతుల్లో 10 సిక్సర్లు, 16 ఫోర్లతో 172 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, టీ20 ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు బాది వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. 2013లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 63 బంతుల్లో 156 పరుగులు చేశాడు...

36 ఏళ్ల  ఆరోన్ ఫించ్, 2015 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కెప్టెన్‌గా 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆరోన్ ఫించ్, స్వదేశంలో జరిగిన 2022 పొట్టి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాని సెమీ ఫైనల్స్ చేర్చలేకపోయాడు.. 

ప్రస్తుతం టీమిండియ ా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా, ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. నాలుగు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత మూడు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్లు ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఆడతారు. జూన్‌లో ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్ ఆడే ఆస్ట్రేలియా జట్టు, జూలైలో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. 

ఇవన్నీ ముగిసిన తర్వాత టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆరోన్ ఫించ్ స్థానంలో కొత్త టీ20 కెప్టెన్‌ని ఎంపిక చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా దగ్గర దాదాపు ఆరు నెలల సమయం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios