AUS vs ENG Ashes 2023: యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో చివరి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

చివరి యాషెస్ టెస్టు మ్యాచ్‌లో భాగంగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 283 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 87 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 295 పరుగులకు కుదించింది. స్టీవ్ స్మిత్ అత్యధికంగా 71 పరుగులు చేశాడు. క్రిస్ వోక్స్ మూడు వికెట్లు తీశాడు. స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 395 పరుగులు చేసింది. జో రూట్ (91), జానీ బెయిర్‌స్టో (78) అత్యధిక పరుగులు చేశారు. జాక్ క్రాలీ 73 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ ఆస్ట్రేలియాకు 384 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేసి 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉస్మాన్ ఖవాజా 72 పరుగులు చేశాడు. క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లు, మొయిన్ అలీ మూడు వికెట్లు తీయగా, స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీశారు. ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ 2-2తో ముగిసింది.
టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి, నాలుగో మ్యాచ్‌ను వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఐదో మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ 2-2తో సిరీస్‌ను ముగించింది.