Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్ 2023 విజేతగా టీమిండియా... వార్ వన్‌సైడ్! 6.1 ఓవర్లలోనే ముగిసిన మ్యాచ్...

Asia Cup 2023 Final: 10 వికెట్ల తేడాతో ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. 6.1 ఓవర్లలోనే ముగిసిన మ్యాచ్.. భారత జట్టు ఖాతాలో 8వ ఆసియా కప్ టైటిల్.. 

Asia Cup 2023 Winner Team India, beats Sri Lanka in final, India vs Sri Lanka CRA
Author
First Published Sep 17, 2023, 6:06 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీని టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఇరు జట్ల హోరాహోరీ పోరు ఆశించినా, మహ్మద్ సిరాజ్ సెన్సేషనల్ బౌలింగ్ స్పెల్ కారణంగా వార్ వన్‌సైడే అయ్యింది.  తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకి ఆలౌట్ కాగా ఈ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే ఛేదించేసి.. 8వ సారి ఆసియా కప్ టైటిల్ కైవసం చేసుకుంది భారత జట్టు..

లక్ష్యం మరీ చిన్నది కావడంతో రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ వచ్చాడు. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కలిసి లంక బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా బౌండరీలు బాదుతూ మ్యాచ్‌ని కొద్ది ఓవర్లలోనే ముగించేశారు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 పరుగులకి ఆలౌట్ అయ్యింది..   2 బంతులు ఆడిన కుసాల్ పెరేరా, బుమ్రా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంక, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో బంతికే సధీర సమరవిక్రమ కూడా డకౌట్ అయ్యాడు..

2 బంతులు ఆడిన సధీర సమరవిక్రమను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు మహ్మద్ సిరాజ్. సమరవిక్రమ డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.  సమరవిక్రమ అవుటైన తర్వాతి బంతికే చరిత్ అసలంక కూడా ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  వస్తూనే బౌండరీ బాదిన ధనంజయ డి సిల్వ, మహ్మద్ సిరాజ్‌కి హ్యాట్రిక్ దక్కకుండా అడ్డుకోగలిగాడు. అయితే ఆ తర్వాతి బంతికి అతను కూడా అవుట్ అయ్యాడు..

2 బంతుల్లో ఓ ఫోర్ బాదిన ధనంజయ డి సిల్వ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సమయానికి 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది శ్రీలంక..  

ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ సిరాజ్. తన తర్వాతి ఓవర్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ శనకని పెవిలియన్ చేర్చాడు మహ్మద్ సిరాజ్. శనక నాలుగు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. సిరాజ్ వేసిన బంతిని అంచనా వేయడంతో పూర్తిగా విఫలమైన శనక, క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. 

కేవలం 16 బంతుల్లో 5 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, అత్యంత వేగంగా వన్డేల్లో 5 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు చమిందావాస్, బంగ్లాదేశ్‌పై 16 బంతుల్లో 5 వికెట్లు తీశాడు. సిరాజ్ ఆ రికార్డును సమం చేశాడు.  5.4 ఓవర్లలోనే 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. ఈ దశలో కుసాల్ మెండిస్, దునిత్ వెల్లలాగే కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 34 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన కుసాల్ మెండిస్‌ని మహ్మద్ సిరాజ్ బౌల్డ్ చేయడంతో 21 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.

21 బంతుల్లో 8 పరుగులు చేసిన దునిత్ వెల్లలాగేని హార్ధిక్ పాండ్యా అవుట్ చేశాడు. 1 పరుగు చేసిన ప్రమోద్ మదుషాన్, పథిరాణాలను వెంటవెంటనే అవుట్ చేసిన హార్ధిక్ పాండ్యా, లంక ఇన్నింగ్స్‌ని ముగించేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios