ఆసియాకప్ 2023: అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్..!
ఇప్పుడు అక్షర్ పటేల్ స్థానంలో టీమ్ లోకి వస్తున్న వాష్టింగ్టన్ సుందర్ కి ఇది ఒక సువర్ణ అవకాశం అని తెలుస్తోంది. దానిని ఆయన సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి.
ఆసియాకప్ 2023లో భారత్ ఫైనల్స్ కి చేరుకుంది. ఈ మ్యాచ్ ఆదివారం కొలంబోలో జరగనుంది. కాగా, ఈ ఫైనల్స్ కి ముందు టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్, జట్టులో చేరడానికి శ్రీలంక వెళ్లాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి సూపర్ 4 మ్యాచ్‌లో అక్షర్ పటేల్ గాయపడిన విషయం తెలిసిందే. కాగా, అక్షర్ పటేల్ స్థానంలో ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ను టీమ్ లోకి రీప్లేస్ చేస్తున్నారు.
శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లలో షకీబ్ అల్ హసన్ జట్టుతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అక్షర్ రెండు చేతులకు గాయమైంది. గాయంతోనే బ్యాటింగ్ చేశాడు. అయితే, ఈ గాయంతో ఆయన ఫైనల్ మ్యాచ్ నాటికి ఫిట్‌గా ఉంటాడనే నమ్మకం లేదు. అందుకే దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ బోర్డు చర్యలు చేపట్టింది. ఫైనల్ మ్యాచ్ జరిగే కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలతో.. మరో స్పిన్ ఆల్‌రౌండర్‌తో అక్షర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో వాషింగ్టన్ సుందర్ ని హుటా హుటిన శ్రీలంకకు బీసీసీఐ రప్పిస్తుండటం విశేషం.
అయితే, ఇప్పుడు అక్షర్ పటేల్ స్థానంలో టీమ్ లోకి వస్తున్న వాష్టింగ్టన్ సుందర్ కి ఇది ఒక సువర్ణ అవకాశం అని తెలుస్తోంది. దానిని ఆయన సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి. అయితే, ఇప్పటి వరకు అయితే అక్షర్ పటేల్ ని జట్టు నుంచి తొలగించలేదు. గాయం తగ్గకపోతే మాత్రమే వాషింగ్టన్ సుందర్ ని ఆ స్థానంలో దింపే అవకాశం ఉంది.
ఇక వాషింగ్టన్ సుందర్, రీసెంట్ గా దేవధర్ ట్రోఫీలో టైటిల్ విన్నింగ్ ఉన్నాడు, అక్కడ అతను ఈస్ట్ జోన్‌తో జరిగిన ఫైనల్‌లో 239 పరుగులతో డిఫెండింగ్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడు. పవర్‌ప్లే లోపల బౌలింగ్ చేయగలడం ఆయన సామర్థ్యం. పవర్ హిట్స్ కూడా బాగా ఆడగలడు.
ఇక, బంగ్లాదేశ్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్, భారత జట్టుపై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. నామమాత్రపు మ్యాచ్‌లో 5 మార్పులతో బరిలో దిగిన భారత జట్టు, ఆఖరి ఓవర్ దాకా పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది.