విరాట్ కోహ్లీ వాకింగ్ స్టైల్‌ని ఇమిటేట్ చేసిన ఇషాన్ కిషన్... ఫన్నీగా నడుస్తూ నవ్వులు పూయించి...

Asia Cup 2023 ప్రెసెంటేషన్ సమయంలో విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేస్తూ ఫన్నీగా నడిచిన ఇషాన్ కిషన్... ఇషాన్‌ని ఇమిటేట్ చేసిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్..

 

Asia Cup 2023 Final: Ishan Kishan Imitates Virat Kohli funny walk after India vs Sri Lanka CRA

ఒక్క విజయం ఎన్ని అపజయాలనైనా మరిచిపోయేలా చేస్తుంది. ఒక్క విజయం మరింత కసిగా పోరాడేందుకు కావాల్సిన ఉత్సాహం నింపుతుంది. అలాంటి అద్భుత విజయమే ఆసియా కప్ 2023 ఫైనల్‌లో టీమిండియాకి దక్కింది. లంక భారీ స్కోరు చేసి దాన్ని ఆఖరి ఓవర్‌లో ఛేదించి ఉంటే.. ఆ జోష్ ఎలా ఉండేదో తెలీదు కానీ వార్ వన్‌సైడ్ చేస్తూ.. ప్రత్యర్థిపై అన్ని రకాలుగా పైచేయి సాధించింది భారత జట్టు..

లంకపై 10 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత్, 8వ సారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టులో ఫన్నీ మూమెంట్స్ జరిగాయి. ప్రెసెంటేషన్ సమయంలో ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేస్తూ ఫన్నీగా నడిచి చూపించాడు. 

‘ఏ నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావ్? నేను అలా అస్సలు నడవను’ అన్నట్టుగా విరాట్ కోహ్లీ కూడా ఇషాన్ కిషన్‌ని ఇమిటేట్ చేస్తూ నవ్వించాడు. ఈ ఇద్దరి మధ్య ఫన్నీ మూమెంట్స్‌ని అక్కడే నిల్చున్న తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్,శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా అండ్ కో చూస్తూ నవ్వుకున్నారు.

ఈ దృశ్యాలన్నింటినీ స్టేడియంలో ఉన్న కొందరు ఫ్యాన్స్, తమ మొబైల్ ఫోన్లలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  

కొలంబోలో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జస్ప్రిత్ బుమ్రా మొదటి ఓవర్ మూడో బంతికే వికెట్ తీశాడు. అక్కడ మొదలైన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. రెండో ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వని మహ్మద్ సిరాజ్, ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.  ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి, మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. 

మొత్తంగా సిరాజ్ 6 వికెట్లు తీయగా, ఆఖర్లో హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. భారత జట్టుపై వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోరు. ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ 6.1 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించారు. వన్డేల్లో అతి తక్కువ బంతుల్లో టీమిండియా ఛేదన చేసిన మ్యాచ్ కూడా ఇదే. 


ఫైనల్‌కి ముందు బంగ్లాతో మ్యాచ్‌లో 265 పరుగుల భారీ స్కోరు అందించారు భారత బౌలర్లు. 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా, షకీబ్ అల్ హసన్, హృదయ్, నసుమ్ అహ్మద్ పోరాటంతో మంచి స్కోరు చేయగలిగింది. 

ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకూ పోరాడిన టీమిండియా, విజయానికి 6 పరుగుల దూరంలో ఆగిపోయింది. అయితే ఆ మ్యాచ్ ప్రభావం లేకుండా ఫైనల్ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చింది భారత జట్టు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios