ప్రస్తుతం క్రీడాప్రపంచంలో తీవ్ర చర్చ సాగుతున్న అంశం యాషెస్ సీరిస్. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఈ టెస్ట్ ఫార్మాట్ పోరుపై కూడా క్రికెట్ ప్రియులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రెండో టెస్ట్ తర్వాత ఈ సీరిస్ మరింత ఆసక్తికరంగా మారింది. తన టెక్నికల్ బ్యాటింగ్ తో ఇంగ్లీష్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని ఆసిస్ బ్యాటింగ్ విభాగానికి  వెన్నెముకలా నిలిచిన స్టీవ్ స్మిత్ గాయంతో మూడో టెస్ట్ కు దూరమయ్యాడు. దీంతో అతడు లేకుండా ఆసిస్ జట్టు ఆతిథ్య బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

సెకండ్ టెస్ట్ లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తూ  జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో గాయపడ్డాడు. అతడు విసిరిన బంతి 149కిమీ వేగంతో వెళ్లి నేరుగా స్మిత్ మెడకు తాకింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు ఆ టెస్ట్ లోనే సెకండ్  ఇన్నింగ్స్ తో పాటు మూడో టెస్ట్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే స్మిత్ గాయపడటానికి ముందు కూడా  ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోడానికి తెగ ఇబ్బంది పడ్డాడు. ఆఫ్ సైడ్ లో కాస్త దూరంగా వెళ్లే బంతులను అతడు వదిలేసిన విధానం అభిమానుల్లో నవ్వులు పూయించింది. 

తాజాగా అదే స్టైల్ ను ఆర్చర్ ఫాలో అయ్యాడు. స్మిత్ ఎలాగయితే ఆఫ్ సైడ్ వచ్చిన బంతుల్ని వదిలేశాడో అదే  బ్యాటింగ్ స్టైల్ ను ఆర్చర్ ఫాలో అయ్యాడు. నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆర్చర్ సరదాగా కాస్సేపు స్మిత్ స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. మరీ ముఖ్యంగా స్మిత్‌ రెండో టెస్టులో తన బౌలింగ్ లో బంతుల్ని ఎలా విడిచిపెట్టాడో దాన్ని ఆర్చర్‌ అనుసరించాడు. ఇలా ఆర్చర్ సరదా బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ వీడియో క్రికెట్ అభిమానులు, నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. 

వీడియో