తన కుమారుడు అర్జున్ టెండుల్కర్, కుమార్తె సారా టెండుల్కర్ ల పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్స్ ని తొలగించాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ అన్నారు. అసలు అర్జున్, సారాలకు అసలు ట్విట్టర్ ఎకౌంట్స్ లేవని సచిన్ పేర్కొన్నారు. వాటిని వెంటనే తొలగించి... ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సచిన్.. ట్విట్టర్ ని కోరారు.

జూనియర్ టెండుల్కర్ పేరిట కొందరు ఓ ట్విట్టర్ ని హ్యాండిల్ చేస్తున్నారు. కాగా... అది ఫేక్ అని సచిన్ స్పష్టం చేశారు. తన కుమారుడు సచిన్, సారాకు అసలు ఎలాంటి ట్విట్టర్ ఎకౌంట్స్ లేవని స్పష్టం చేశారు. జూనియర్‌ టెండూల్కర్‌ పేరుతో కొంతమంది ప్రముఖలపై వ్యతిరేకంగా ట్వీట్లు వస్తున్న నేపథ్యంలో సచిన్‌ స్పందించాడు.

‘ఆ అకౌంట్‌ అర్జున్‌ టెండూల్కర్‌ది కాదు. అసలు అర్జున్‌కు ట్వీటర్‌ అకౌంట్‌ లేదు. మా పిల్లలు ఇద్దరికీ ట్వీటర్‌ అకౌంట్లు లేవు. పలువురిపై జూనియర్‌ టెండూల్కర్‌ పేరుతో వస్తున్న ట్వీట్లు మా కుమారుడివి కావు. అది ఫేక్‌ అకౌంట్‌. దానిపై ట్వీటర్‌ ఇండియా  సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి’ అని సచిన్‌ విజ్ఞప్తి చేశాడు.

మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మద్దతు ఇస్తున్నానంటూ జూనియర్‌ టెండూల్కర్‌ పేరుతో ఒక ట్వీట్‌ వెలుగు చూసింది. ‘ ఐయామ్‌ విత్‌ ఫడ్నవీస్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో జూనియర్‌ టెండూల్కర్‌ అకౌంట్‌లో దర్శనమిచ్చింది. ఇది సచిన్‌ కుమారుడు అర్జున్‌ చేసిందంటూ పెద్ద దుమారం లేచింది. దాంతో సచిన్‌ వివరణ ఇచ్చుకుంటూ తన కుమారుడుకు ట్వీటర్‌ అకౌంట్‌ లేదన్నాడు. అలానే కూతురు సారాకు కూడా ఎటువంటి అకౌంట్‌ లేదన్నాడు.