ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం! షకీబ్ చేసింది కరెక్ట్ కాదు.. మాథ్యూస్ టైమ్‌ అవుట్‌పై వివాదం..

హెల్మెట్ విరిగినందుకు ఆలస్యమైందని చెప్పినా పట్టించుకోని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్... క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ విమర్శలు.. 

Angelo Matthews Time-out controversy, Shakib al hasan spirit takes discussion CRA

శ్రీలంక సీనియర్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో టైమ్ అవుట్ విధానంలో అవుటైన విషయం తెలిసిందే. సధీర సమరవిక్రమ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాథ్యూస్, బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధమైన తర్వాత తన హెల్మెట్ విరిగిపోయిన విషయాన్ని గుర్తించాడు..

దీంతో వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌ వైపు తిరిగి హెల్మెట్ తీసుకురావాల్సిందిగా కోరాడు. అయితే అప్పటికే సధీర సమరవిక్రమ అవుటై 3 నిమిషాలు దాటడం, ఏంజెలో మాథ్యూస్ ఇంకా బ్యాటింగ్‌కి సంసిద్ధం కాకపోవడంతో ‘టైమ్ అవుట్’ కోసం అప్పీల్ చేసింది బంగ్లాదేశ్ జట్టు..

ఓ బ్యాటర్ అవుటైన తర్వాత మరో బ్యాటర్ క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌కి సిద్ధమవ్వడానికి టీ20ల్లో 2 నిమిషాలు, వన్డే, టెస్టుల్లో 3 నిమిషాల నిర్దిష్ట సమయం ఉంటుంది. ఈ లోగా బ్యాటర్ సిద్ధం కాకపోతే అతన్ని టైమ్ అవుట్‌గా ప్రకటించి, అవుటైనట్టు ప్రకటిస్తారు. ఈ రూల్‌ని వాడుకున్న బంగ్లాదేశ్, మాథ్యూస్‌ని బ్యాటింగ్ చేయనివ్వకుండానే పెవిలియన్ చేర్చింది..

టైమ్ అవుట్ కోసం అప్పీల్ చేయగానే బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దగ్గరికి వెళ్లి, హెల్మెట్ గురించి చెప్పేందుకు ప్రయత్నించాడు ఏంజెలో మాథ్యూస్. అయితే బంగ్లా కెప్టెన్ మాత్రం మాథ్యూస్‌ని పట్టించుకోలేదు. దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి..

‘ఢిల్లీలో ఈరోజు జరిగింది అత్యంత దారుణం... ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం’ అంటూ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశాడు. 

‘ఏంజెలో మాథ్యూస్ కావాలని లేట్ చేయలేదు. అతని హెల్మెట్‌లో సమస్య ఉంది. అలాంటప్పుడు దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి అతనికి 2-3 నిమిషాల ఎక్స్‌ట్రా టైం ఇచ్చి ఉండాల్సింది. ఇదైతే కరెక్ట్ కాదు..’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ కామెంట్ చేశాడు..

‘షకీబ్ ప్లేస్‌లో నేను ఉంటే అప్పీల్ చేసేవాడిని కాదు. అతని హెల్మెట్ విరిగిపోవడం వల్ల ఆలస్యమైంది. అది కావాలని చేసింది కాదు..’ అంటూ భారత మాజీ క్రికెటర్ ఎస్. బద్రీనాథ్.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios