టైమ్డ్ ఔట్‌ నిర్ణయం తప్పు: వీడియో స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్టు చేసిన మాథ్యూస్


క్రికెట్ చరిత్రలో  ఏనాడూ జరగని టైమ్డ్ ఔట్  విషయమై  చర్చ సాగుతుంది.    శ్రీలంక బ్యాటర్  మాథ్యూస్  టైమ్డ్ ఔటై రికార్డులకు ఎక్కారు. భారత్ చేతిలో  ఘోర పరాజయం తర్వాత శ్రీలంక జట్టులోనే మాథ్యూస్ టైమ్డ్ ఔటయ్యాడు.

Angelo Mathews provides video evidence to prove umpires wrong as timed out dismissal creates big World Cup controversy  lns

న్యూఢిల్లీ: శ్రీలంక ఆల్ రౌండర్  ఎంజెలో మాథ్యూస్ టైమ్డ్  ఔట్ విషయమై  వీడియో సాక్ష్యాన్ని  అందించారు.   న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ తో  జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో  ఏంజెలో మాథ్యూస్ సరైన సమయానికి క్రీజ్ లోకి రాలేదని టైమ్డ్ ఔట్ గా  ప్రకటించారు.   క్రికెట్ చరిత్రలో  టైమ్డ్ ఔట్ గా  అవుటైన తొలి క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్  గా రికార్డు సృష్టించారు. 

తనను టైమ్డ్ ఔట్ గా  ప్రకటించడాన్ని తప్పుబడుతూ  ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను  మాథ్యూస్  బహిర్గతపర్చారు.

శ్రీలంక బ్యాట్స్ మెన్  సమరవిక్రమ అవుటైన తర్వాత  బ్యాటింగ్ కోసం  మాథ్యూస్  మైదానంలోకి వచ్చాడు. అయితే  ఆ సమయంలో తన హెల్మెట్  పాడైన విషయాన్ని ఆయన గుర్తించాడు.  వెంటనే  మరో హెల్మెట్ ను  తేవాలని  సహచర ఆటగాడికి సూచించాడు. ఈ సమయంలో బంగ్లాదేశ్ కెప్టెన్  షకీబ్ అంపైర్ వద్దకు వెళ్లి  అప్పీల్ చేశారు.  ఈ అప్పీల్ తో అంపైర్ మాథ్యూస్ ను ఔటైనట్టుగా ప్రకటించారు.టైమ్డ్ ఔట్ గా  డగౌట్ లోని ప్రవేశించే సమయంలో  మాథ్యూస్ తన హెల్మెట్ ను గాల్లోకి విసిరేశాడు. అంతే కాదు తన చేతి గ్లోవ్స్ ,బ్యాట్ ను కూడ విసిరేశాడు.

క్రికెట్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

టైమ్డ్ ఔట్ విషయంలో  బంగ్లాదేశ్ కెప్టెన్  అప్పీల్ చేయడంలో తప్పు లేదు.  ఒక బ్యాట్స్ మెన్ ఔటైన మూడు నిమిషాల్లోనే మరో బ్యాట్స్ మెన్  క్రీజ్ లో సిద్దంగా ఉండాలని క్రికెట్ నిబంధనలు చెబుతున్నాయి. అయితే ప్రపంచకప్ లో మాత్రం  ఇది రెండు నిమిషాలు మాత్రమే. షకీబ్ మాత్రం  తన అప్పీల్ విషయంలో వెనక్కు తగ్గలేదు. బంగ్లాదేశ్ కెప్టెన్ తన అప్పీల్ విషయంలో  వెనక్కి తీసుకుంటే అభ్యంతరం లేదని పీల్డ్ అంపైర్లు  చెప్పారు.

నాలుగో అంపైర్  ఏం చెప్పాడంటే?

మాథ్యూస్ టైమ్డ్ ఔట్ పై  నాలుగవ అంపైర్  అడ్రియన్ హోల్డ్ స్టా  వివరణ ఇచ్చాడు. క్రికెట్ నిబంధనల మేరకు రెండు నిమిషాలకు ముందు  క్రీజ్ లోకి రావాలనే నిబంధనను మాథ్యూస్ ఉల్లంఘించారన్నారు.ఒక వికెట్  పడిపోయిన సమయంలో  లేదా  బ్యాటర్ రిటైర్మెంట్ విషయానికి వస్తే  ఇన్ కమింగ్ బ్యాటర్ పొజిషన్ లో ఉండాలన్నారు. అంతేకాదు రెండు నిమిషాల్లో బంతిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆయన గుర్తు చేశారు.  వెస్టిండీస్ మాజీ పేసర్  ఇయాన్ బిషప్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  హెల్డ్ స్టాక్ పేర్కొన్నారు.

వికెట్ పడిన సమయంలో  టీవీ అంపైర్  రెండు నిమిషాల కాలవ్యవధిని పర్యవేక్షిస్తుంటారని  ఆయన చెప్పారు.ఈ విషయమై  ఆన్ ఫీల్డ్ అంపైర్లకు సందేశాన్ని పంపుతామన్నారు. రెండు నిమిషాల్లో  బంతిని ఎదుర్కొనేందుకు  మాథ్యూస్ సిద్దంగా లేనందున టైమ్డ్ ఔట్ అయ్యాడని ఫోర్త్ అంపైర్ వివరించారు. 

బంగ్లాదేశ్ కెప్టెన్  స్టాండ్ ఇన్ అంపైర్ గా ఉన్న ఎరాస్మస్ వద్ద అప్పీల్ చేశారన్నారు. నిర్ణీత రెండు నిమిషాల వ్యవధి ముగిసినందున  అప్పీల్ చేశాడు. అయితే  ఈ అప్పీల్ ముగిసిన తర్వాత  మాథ్యూస్  తన హెల్మెట్  ను చూపాడు. అయితే అప్పటికే సమయం ముగిసిందని షకీబ్ పేర్కొన్నారు.

మాథ్యూస్ ఏం చెబుతున్నాడంటే

తన టైమ్డ్ ఔట్ విషయంలో  మాథ్యూస్ సోషల్ మీడియా వేదికగా  తన వాదనను బలంగా విన్పిస్తున్నారు. తనకు మరో హెల్మెట్  ఇచ్చిన తర్వాత కూడ ఇంకా 5 సెకన్ష సమయం ఉందని వీడియో సాక్ష్యం చూపిస్తుందన్నారు.  నాలుగో అంపైర్ ఈ విషయాన్ని సరిదిద్దగలరా అని  ఆయన ప్రశ్నించారు.హెల్మెట్ లేకుండానే తాను  బ్యాటింగ్  చేయలేనని చెప్పారు. తన భద్రత కూడ ముఖ్యమేనని మాథ్యూస్  చెప్పారు. 

 

సమరవిక్రమ ఔటైన సమయం నుండి తాను క్రీజులో నిలబడిన  క్షణం వరకు  స్క్రీన్ షాట్లను పోస్టు చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వీడియో ఆధారాలతో ముందుకు వస్తామని  ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో  ఆయన ప్రకటించారు. రెండు నిమిషాల్లోనే తాను  క్రీజ్ లోకి చేరుకున్నట్టుగా  చెప్పారు. తన వద్ద వీడియో ఆధారాలున్నాయన్నారు.  తమ వద్ద వీడియో సాక్ష్యాలున్నాయన్నారు.  ప్రతిదీ పరిశీలించిన తర్వాతే తాను  ఈ విషయాలు చెబుతున్నట్టుగా  ఆయన తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios