అతన్ని కాపాడడానికి ప్రయత్నించా, కానీ... ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో ప్రత్యక్ష సాక్షి...

46 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచిన ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్... ఘటనా స్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్షి కథనం...

Andrew Symonds death: I tried to save him but, Local man reveals what happend after Road accident

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణం యావత్ క్రీడా ప్రపంచంలో విషాద ఛాయలు నింపేసింది. ఆసీస్ మాజీ దిగ్గజం, లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ గుండెపోటుతో మరణించిన రెండు నెలలకే ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం క్రికెట్ ఆస్ట్రేలియాను కలిచివేసింది...

శనివారం రాత్రి క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో 46 ఏళ్ల ఆండ్రూ సైమండ్స్... అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి, సైమండ్స్ ప్రాణాలు కాపాడడానికి శత విధాలా ప్రయత్నించాడట...

‘నా కళ్ల ముందే కారు యాక్సిడెంట్‌కి గురైంది. కారులో ఇరుక్కుపోయిన అతన్ని, బయటికి లాగడానికి చాలా ట్రై చేశా. ఆ సమయంలో అక్కడ నేనొక్కడినే ఉండడంతో బయటికి తీయడానికి కాస్త సమయం పట్టింది. వెంటనే సీపీఆర్ చేయడం మొదలెట్టాను. అతని పల్స్ చెక్ చేశా. అయితే అతను నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ సమయంలో కారులో ఉన్నది క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ అనే విషయం కూడా నాకు తెలీదు...’ చెప్పుకొచ్చాడు కారు ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షిగా మారిన విల్సన్ టౌన్సన్ అనే స్థానిక వ్యక్తి...

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆండ్రూ సైమండ్స్‌ని బతికించడానికి శాయశక్తులా ప్రయత్నించాయి. అయితే అప్పటికే ఆండ్రూ సైమండ్స్ ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది...

అయితే అతివేగంగా దూసుకెళ్తున్న ఆండ్రూ సైమండ్స్ కారు, ఉన్నపళంగా బోల్తా కొట్టడానికి ముందు రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టింది. సైమండ్స్ కారు డివైడర్‌ ఢీకొట్టడానికి కారణం ఏంటి? ఎవరైనా అడ్డుగా వచ్చారా? లేక సడెన్‌గా కారు కంట్రోల్ తప్పిందా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే విషయాలు తెలియరాలేదని పోలీసులు తెలియచేశారు. 

ఆస్ట్రేలియా తరుపున 26 టెస్టులు, 198 వన్డేలు ఆడిన ఆండ్రూ సైమండ్స్... ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జెర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల తరుపున ఆడాడు... 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో రూ.5 కోట్ల 40 లక్షల భారీ మొత్తానికి ఆండ్రూ సైమండ్స్‌ని కొనుగోలు చేసింది డెక్కన్ ఛార్జెర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2008 వేలంలో రూ.6 కోట్లు దక్కించుకున్న ఎమ్మెస్ ధోనీ తర్వాత అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్ సైమండ్సే...

2008లో ఓ వన్డే మ్యాచ్‌కి ఆండ్రూ సైమండ్స్ తాగేసి మత్తులో వచ్చాడని మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. రికీ పాంటింగ్ తర్వాత ఆసీస్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న మైకేల్  క్లార్క్ కెప్టెన్సీని తీవ్రంగా విమర్శించిన ఆండ్రూ సైమండ్స్... కొన్ని రోజుల క్రితం ఐపీఎల్ వల్లే తమ స్నేహం చెడిపోయిందని వాపోయాడు...

ఆసీస్ మాజీ క్రికెటర్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రికెట్ కెప్టెన్ రికీ పాంటింగ్ కెప్టెన్సీలో క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న ఆండ్రూ సైమండ్స్... క్రికెట్‌లో అనుకున్నంత సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. సైమండ్స్ కెరీర్‌లో అనేక వివాదాలు అతని కెరీర్‌ని అర్ధాంతరంగా ముగింపు పలికేలా చేశాయి...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios