హైదరాబాద్: తెలుగు టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు దంపతులకు పండంటి కూతురు జన్మించింది. అంబటి రాయుడు, చెన్నుపల్లి విద్య దంపతులకు కూతురు పుట్టింది. రాయుడు, ఆయన భార్యతో పాటు శిశువు ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఆ విషయాన్ని ధ్రువీకరించింది. 

ఆదివారంనాడు రాయుడి దంపతులకు కూతురు పుట్టింది. సోషల్ మీడియాలో ఆ వార్త రాగానే అన్ని వైపుల నుంచి అంబటి రాయుడు దంపతులకు శుభాకాంక్షలు అందుతూ వచ్చాయి. భారత క్రికెటర్, తన ఐపిఎల్ జట్టు సభ్యుడు సురేష్ రైనా రాయుడిని అభినందించాడు. ఆ మేరకు ట్విట్టర్ లో తన సందేశాన్ని పెట్టాడు. 

 

రైనా శుభాకాంక్షలకు రాయుడు ప్రతిస్పందించాడు. సోదరా! ధన్యవాదాలు అంటూ రాయుడు అన్నాడు. రాయుడు కళాశాలలో తన సహ విద్యార్థిని విద్యను 2009లో వివాహం చేసుకున్నాడు. 

భారత క్రికెట్ జట్టులో కొంత కాలం పాటు రాయుడు కీలకమైన బ్యాట్స్ మన్ గా వ్యవహరించాడు. 2018 నవంబర్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడిగా ఐపిఎల్ లో 2010లో కాలు పెట్టాడు.