విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు లేకపోయినా బాక్సింగ్ డే టెస్టులో గెలిచి, ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చిన భారత జట్టుకు గాయాలు షాక్ ఇస్తున్నాయి. సిడ్నీ టెస్టులో బ్యాటింగ్ చేస్తూ ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్ తీవ్రంగా గాయపడ్డారు.

ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌ మోచేతికి గాయం కావడంతో మూడో ఇన్నింగ్స్‌లో బరిలో దిగలేదు. పంత్‌ను స్కానింగ్ కోసం పంపించడంతో అతని స్థానంలో వృద్ధిమాన్ సాహా కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా వికెట్ కీపింగ్ చేశాడు.

మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఎడమ చేతి బొటిన వేలుకి గాయమైంది. బ్యాడ్ వేసుకుని బ్యాటింగ్ కొనసాగించిన జడ్డూ, మొదట ఫీల్డింగ్‌కి రాలేదు. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ సబ్‌స్టిట్యూడ్ ఫీల్డింగ్ చేశాడు.

అయితే కొద్దిసేపటికే జడేజా వేలు నుంచి రక్తస్రావం కావడంతో స్కానింగ్ చేసేందుకు తరలించారు డాక్టర్లు. గాయం తీవ్రమైతే మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన జడేజా, ఈ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసే అవకాశం ఉండదు. బ్యాటింగ్‌లోనూ రాణించిన జడ్డూ లేకపోతే భారత జట్టు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.