జూన్ 23 నుంచి  శ్రీలంక పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనున్న భారత మహిళా జట్టు... హర్మన్‌ప్రీత్ కౌర్‌కి వన్డే సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సెలక్టర్లు... 

వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలను టీ20 కెప్టెన్, వన్డే వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కి సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ... మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటన ఇచ్చిన కొన్ని గంటలకే శ్రీలంకతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును ప్రకటించింది బీసీసీఐ...

జూన్ 23 నుంచి మొదలయ్యే శ్రీలంక పర్యటనలో భారత మహిళా జట్టు, మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డే మ్యాచులు ఆడనుంది. నాలుగేళ్లుగా టీ20 కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ గైర్హజరీలో కొన్ని మ్యాచులకు వన్డే కెప్టెన్‌గా వ్యవహరించింది...

టీ20 సిరీస్‌లు దంబుల్లాలో, వన్డే మ్యాచులు కెండీలో జరుగుతాయి. వన్డే, టీ20 రెండు ఫార్మాట్లకు స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మతో పాటు వికెట్ కీపర్ యషికా భాటియా, రిచా ఘోష్‌లకు లంకతో రెండు ఫార్మాట్లలో అవకాశం కల్పించారు సెలక్టర్లు..

వన్డే సిరీస్‌కి ఎంపికైన వికెట్ కీపర్ తానియా భాటియా, హర్లీన్ డియోల్‌‌లకు టీ20 సిరీస్‌లో అవకాశం దక్కలేదు. అలాగే టీ20 సిరీస్‌కి ఎంపికైన జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్‌లకు వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. ఈ నలుగురు మినహా మిగిలిన జట్టు మొత్తం వన్డే, టీ20 సిరీస్‌లలో పాల్గొననుంది.

శ్రీలంకతో వన్డే సిరీస్‌కి భారత మహిళా జట్టు ఇది: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా, హర్లీన్ డియోల్...

టీ20 సిరీస్‌కి భారత మహిళా టీమ్ ఇది: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్...