ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో ముగ్గురు మృతి
కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 135 కేసులు బయటపడ్డాయి. కరోనాతో ముగ్గురు చనిపోయారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకెండ్ వేవ్ తరువాత నెమ్మదించన కేసులు గత రెండు నెలల నుంచి పెరగుతున్నాయి. ఈ నెల మొదటి వారం నుంచి వేగంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కూడా విస్తరిస్తోంది. ఇప్పటి వరకే దేశంలో 269 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలు కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే క్రిస్ట్‌మస్, న్యూయర్ వేడుకలపై నిషేదం విధించారు. మరిన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 135 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో 20,76,212 కేసులు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1,326 మంది యాక్టివ్ కరోనా రోగులు ఉన్నారని తెలిపింది. ఇప్పటి వరకు 20,60,400 కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది.
కక్షతోనే నాపై కేసులు: వైసీపీ సర్కార్ పై ఆశోక్ గజపతి రాజు
ముంబైలో 602 కరోనా కేసులు నమోదు..
గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర రాజధాని ముంబైలో 602 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కరోనా నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. ఈ కొత్త వేరియంట్ చిన్నారులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని వార్తలు వస్తుండటంతో ఆ రాష్ట్రంలో విద్యాసంస్థలను మూసి వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్ వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. తమకు పిల్లల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని, అవసరమైతే స్కూళ్లను మూసివేస్తామని ఇటీవల ఆయన తెలిపారు.
భారీ వర్షాలతో నిరాశ్రయులైన వారిని ఆదుకొంటాం: ప్రొద్దుటూరులో వైఎస్ జగన్
మహారాష్ట్రలో ఇప్పటి వరకు అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి. ఇన్ని ఒమిక్రాన్ కేసులతో దేశంలోనే మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. దీంతో అక్కడ ఆంక్షలు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. నిజానికి మహారాష్ట్రలో విద్యా సంస్థలను గత అక్టోబర్‌లోనే ప్రారంభించారు. ప్రైమెరీ స్కూల్స్ డిసెంబర్ మొదటి నుంచి ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న విద్యార్థుల చదువులు మళ్లీ వెనక్కి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఒమిక్రాన్ పాజిటివిటీ రేటు కూడా అధికంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో సగం కంటే ఎక్కువ మంది కోలుకొని ఇంటికి వెళ్లిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు ఒమిక్రాన్ కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కర్నాటకలో కేవలం న్యూయర్ వేడుకలు రద్దు చేశారు. ఢిల్లీలో మాత్రం క్రిస్మస్, న్యూయర్ వేడుకలతో పాటు పెద్ద పెద్ద సమావేశాలు, సభలు వంటి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలంగాణలో కూడా న్యూయర్, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించే అంశం పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనిపై మంత్రి హారీశ్ రావు సానుకూలంగా స్పందించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని తెలిపారు.