Asianet News TeluguAsianet News Telugu

Coronavirus : ఫోర్త్ వేవ్ టెన్ష‌న్.. ఢిల్లీలో ఒక్క రోజులోనే వెయ్యికిపైగా కొత్త క‌రోనా కేసులు,,

దేశంలో కోవిడ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, దాని పక్కన ఉన్న రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. ఢిల్లీలో ఒక్క రోజులోనే వెయ్యికిపైగా కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. 

Fourth Wave Tension.. Over a thousand new corona cases in a single day in Delhi,,
Author
New Delhi, First Published Apr 21, 2022, 12:34 AM IST

దేశ రాజధానిలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో ఢిల్లీలో వెయ్యికి పైగా కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. అధికారులు విడుద‌ల చేసిన లెక్క‌ల ప్ర‌కారం మొత్తంగా 1009 కోవిడ్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2641కి చేరింది. క‌రోనా వ‌ల్ల గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో ఒక‌రు మ‌ర‌ణించారు. 314 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 

ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 5.70 శాతానికి పెరిగింది. కాగా మంగళవారం ఢిల్లీలో 632 కరోనా కేసులు నమోదయ్యాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా న‌మోదైంది. దేశ రాజ‌ధానిలో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించడం ప్ర‌భుత్వం తప్పనిసరి చేసింది.  దీని ప్ర‌కారం ప్ర‌జ‌లు నిబంధ‌లు ఉల్లంఘిస్తే వారికి రూ.500 జరిమానా విధిస్తారు. బుధవారం జరిగిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

అయితే పాఠశాలలను మూసివేయకూడదని అధికారులు నిర్ణయించారు. పాఠశాలల నిర్వహణ కోసం నిపుణుల నుండి తీసుకున్న సలహాల ఆధారంగా ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) అమలు చేస్తామ‌ని చెప్పారు. సామాజిక సమావేశాలపై నిశితంగా ప‌రిశీల‌న జ‌ర‌పాల‌ని, దేశ రాజధానిలో COVID-19 పరీక్షల సంఖ్యను పెంచాలని అధికారులను ప్ర‌భుత్వం ఆదేశించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, రోగులకు చికిత్స అందించ‌డాని అన్ని ఏర్పాట్లు చేయాల‌ని అధికారులను ఆదేశించిన‌ట్టు ఉన్న‌తాధికారులు చెప్పారు. అర్హులైన అంద‌రికీ టీకా అందించేలా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయాల‌ని ఈ ఈ డీడీఎంఏ సమావేశంలో అధికారులు నిర్ణ‌యించారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంద‌ని అన్నారు. కాబ‌ట్టి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. వచ్చే పక్షం రోజుల్లో ఆసుపత్రిలో చేరే రోగుల సమాచారాన్ని సేకరించి, దానిని విశ్లేషించాల‌ని సమావేశంలో ఉద్ఘాటించారు. అలాగే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో ఇన్‌ఫెక్షన్‌ నిర్ధారణ అయిన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాల‌ని నిర్ణ‌యించారు. 

కాగా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలెర్ట్ అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరం ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య కార్య‌ద‌ర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. అంటువ్యాధుల వ్యాప్తిపై పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. 

ఇదిలా ఉండగా దేశ రాజధాని చుట్టుపక్కల ఉన్న ఇతర రాష్ట్రాల జిల్లాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాలు ఆ జిల్లాలో ఫేస్ మాస్కులు ఉపయోగించడం తప్పనిసరి చేసింది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్‌పత్‌తో పాటు రాజధాని లక్నోలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ను తప్పకుండా ధరించాలని చెప్పింది. అలాగే హర్యానా ప్రభుత్వం కూడా గురుగ్రామ్‌, ఫరీదాబాద్, సోనిపట్ ఝజ్జర్ జిల్లాలలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios