coronavirus : కరోనా భయం.. ఢిల్లీలో ప్రైవేట్ ఆఫీసులకు ఇక నుంచి వర్క్ ఫ్రం హోం..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మినహాయింపుపొందిన కొన్ని ఆఫీసులు తప్పా.. మిగిలిన అన్ని ప్రైవేటు ఆఫీసులు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా (corona) విజృంభిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి దేశం రెండు వేవ్‌లను చూసింది. ఇప్పుడు మరో వేవ్ మొదలైంది. గత రెండు వేవ్ లు దేశానికి ఎంతో నష్టాన్ని మిగిల్చాయి. ఆర్థికంగా ఎందరో మంది ఇబ్బంది పడ్డారు. మరెందరో మంది తమ ఆత్మీయులను కోల్పొయారు. కొంత మంది ఉద్యోగాలు పోతే, మరి కొందరు చదువులు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయి.. మళ్లీ జన జీవనం గాడిలో పడుతుందనుకుంటున్న సమయంలో పెరుగుతున్నాయి.
గత పది రోజుల కిందట దేశంలో రోజుకు పది వేల కంటే తక్కువగానే కేసులు నమోదయ్యేవి. అయితే మూడు రోజల నుంచి ఏకంగా కేసులు లక్షదాటిపోతున్నాయి. ఇలా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ (omicron veriant) కేసులు కూడా పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్ మన దేశంలో గత డిసెంబర్ 2వ తేదీన గుర్తించారు. భారత్ లోని కర్నాటకలో మొదటి రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ కేసులు కూడా మూడు వేలకు దాటాయి. ఈ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందినా స్వల్ప లక్షణాలు, స్వల్ప తీవ్రత ఉండే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కొంచెం ఊరట కలిగించే అంశం. అయితే ఈ వేరియంట్ సోకినా ధీర్ఘకాలికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి నిర్లక్ష్యం వహించకుండా తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో కరోనా (corona) కేసుల పెరుగుదలలో ఢిల్లీ (delhi), మహారాష్ట్రలు (maharastra) ముందు వరసలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ (night curfew), వీకెండ్ కర్ఫ్యూలు (weekend curfew) విధిస్తున్నాయి. ప్రజలు గుమిగూడకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని ప్రైవేట్ ఆఫీసులన్నీ(privet offices) వర్క్ ఫ్రం హోం (work from home) అమలు చేయాలని సూచించాయి. అయితే కొన్ని మినహాయింపు పొందిన ఆఫీసులకు దీనిని వర్తింపజేయడం లేదు. ఈ మేరకు ఢిల్లీ డిజాస్గర్ మేనేజ్ మెంట్ అథారిటీ (DDMA) మార్గదర్శకాలు విడుదల చేసింది. ‘‘ గతేడాది ఆగస్టులో డీడీఎంఏ (DDMA) విడుదల చేసిన మార్గదర్శకాల్లో మినహాయించిన కేటిగిరిలో ఉన్న ఆఫీసులు తప్పా.. అన్ని ప్రైవేట్ ఆఫీసులు మూసివేయబడతాయి. ఇక నుంచి ఆఫీసులన్నీ వర్క్ ఫ్రం హోం పద్దతిని అనుసరించాలి’’ అని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఢిల్లీ నగరంలో ఇప్పటి వరకు ప్రైవేట్ ఆఫీసులు 50 శాతం సిబ్బందితో పని చేసేందుకు అనుమతి ఉంది. కొత్త నిబంధనల ప్రకారం కొన్ని ఆఫీసులు మినహా మిగితా అన్ని ఆఫీసులు వర్క్ ఫ్రం హోం అమలు చేయాల్సి వస్తోంది. ఢిల్లీలో సోమవారం నుంచి రెస్టారెంట్లలో భోజనం చేసే సౌకర్యాన్ని నిలిపివేసింది. కేవలం ఫుడ్ హోం డెలివేరీ (food home delivery), పార్శిల్ (parcel) విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 19 వేల కంటే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో 17 మంది మృతి చెందారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ (health buliten) విడుదల చేసింది.