Coronavirus : ఫోర్త్ వేవ్ టెన్ష‌న్.. XE వేరియంట్‌పై కర్ణాటక హెల్త్ మినిస్ట‌ర్ ఏమ‌న్నారంటే ?

కరోనా XE వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ ను కంప్లీట్ చేసుకోవాలని కర్ణాటక హెల్త్ మినిస్టర్ అన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు ముందస్తు డోసును తీసుకోవాలని సూచించారు. అందరూ మాస్క్ లు ధరించాలని కోరారు. 

Coronavirus : Fourth Wave Tension .. What did the Karnataka Health Minister say about the XE variant?

కరోనా మళ్లీ కలరపెడుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. యూకే, చైనాలో అయితే ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి. అయితే యూకేలో మొట్ట మొద‌టి సారిగా ఓ కొత్త క‌రోనా వేరియంట్ వెలుగులోకి వ‌చ్చింది. దీనిని ఎక్స్ ఈ వేరియంట్ అని పిలుస్తున్నారు. అయితే ఇది ఇండియాలోకి కూడా ప్ర‌వేశించింది. గుజరాత్ లో ఈ వేరియంట్ కేసు ఇటీవ‌లే న‌మోదైంది. 

ఈ ఒమిక్రాన్ హైబ్రిడ్ స్ట్రెయిన్ XE వేరియంట్ పై క‌ర్ణాట‌క హెల్త్ మినిస్ట‌ర్ డాక్ట‌ర్ కె.సుధాక‌ర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. ప్ర‌తీ ఒక్క‌రూ వారికి నిర్దేశించిన డోసుల వ్యాక్సిన్ ను వేసుకోవాలని తెలిపారు. నాలుగో వేవ్ వ‌స్తే దానిని ఎదుర్కొనేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని అన్నారు. 

కోవిడ్-19 XE వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో COVID-19 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (TAC)తో కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాక‌ర్ మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ద‌య‌చేసి ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ పూర్తి స్థాయి వ్యాక్సినేష‌న్ ను కంప్లీట్ చేయాల‌ని అన్నారు. జూన్ నుంచి జూలై మ‌ధ్య‌లో మ‌రో కోవిడ్ వేవ్ ఉంద‌ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ అంచనా వేసింద‌ని తెలిపారు. కాబ‌ట్టి అంద‌రూ వ్యాక్సిన్ వేయించుకోవ‌డంతో పాటు మాస్క్ లు ధ‌రించాల‌ని కోరారు. 

చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, యూకే, జర్మనీతో సహా ఎనిమిది వేర్వేరు దేశాల్లో ఇప్పటికే చలామణిలో ఉన్న XE వేరియంట్‌కు సంబంధించిన కేసులు ఢిల్లీ, హర్యానాలో పెరుగుతున్నాయని ఆయన హోమ్ మినిస్ట‌ర్ సుధాక‌ర్ అన్నారు. ‘‘ ఈ ఎనిమిది దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్, కఠినమైన నిఘా, 7-10 రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి చేయాలని TAC సూచించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుంది’’ అని ఆయ‌న చెప్పారు. 

కర్ణాటకలో ఇప్ప‌టి వ‌ర‌కు 60 ఏళ్ల పైబ‌డిన వారిలో 98 శాతం జ‌నాభాకు అంటే 4.77 కోట్ల మంది COVID-19 రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నార‌ని చెప్పారు. అయితే ఇందులో 49 శాతం మంది మాత్ర‌మే మ‌రో అద‌న‌పు డోసు తీసుకున్నార‌ని అన్నారు. వృద్ధులంద‌రూ ముందు జాగ్ర‌త్త డోసును తీసుకోవాల‌ని కోరారు.  ‘‘ గతంలో కోవిడ్-19 వేవ్ వ్యాక్సిన్ల కొరత కారణంగా కొందరు ప్రభుత్వాన్ని నిందించారు. ఇప్పుడు, తగినంత సరఫరా ఉంది. వ్యాక్సిన్ తీసుకోవాలని మేము ప్రజలకు అనేక అభ్యర్థనలు చేస్తున్నాం. దయచేసి ప్రజలు వ్యాక్సిన్ తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలి ’’ అని ఆయ‌న అన్నారు. 

 క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ప్రైవేట్ హ‌స్పిటల్స్ లో వ్యాక్సిన్ కోసం అధిక ఛార్జీలు వ‌సూలు చేస్తున్నార‌నే విష‌యంపై మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి విష‌యాన్ని ప్ర‌భుత్వం సహించ‌ద‌ని అన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ల కోసం అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు త‌మ‌కు ఫిర్యాదులు అందాయ‌ని దీనిపై చర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. దీని కోసం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కమిటీని ఏర్పాటు చేసినట్లు సుధాకర్ తెలిపారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios