coronavirus : ఒమిక్రాన్‌ను తేలికగా తీసుకోవద్దు - డ‌బ్లూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్

ఒమిక్రాన్ వేరియంట్ ను తేలికగా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు.ఈ కొత్త వేరియంట్ విషయంలో అశ్రద్దగా ఉండొద్దని హెచ్చరించారు. 

Coronavirus- Do not take Omicron lightly - WHW Chief Tedros Adhanam Ghebroesus

ఒమిక్రాన్ (omicron) క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ కొత్త వేరియంట్ కేసులు అధికంగా న‌మోదవుతున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన ఈ కొత్త వేరియంట్ అన్ని దేశాల్లోనూ త‌న ప్ర‌తాపం చూపిస్తోంది. ఇండియాలో కూడా ఈ వేరియంట్ అధికంగానే న‌మోద‌వుతోంది. గ‌తేడాది డిసెంబ‌ర్ 2వ తేదీన వెలుగులోకి వ‌చ్చిన ఈ కొత్త వేరియంట్ కేసులు ఇప్పుడు మూడు వేల‌ను దాటాయి. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ కొత్త వేరియంట్ కేసులు ఇంత వేగంగా విస్త‌రించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

ఈ కొత్త వేరియంట్ (new veriant)  స్వ‌ల్ఫ ల‌క్ష‌ణాలు, స్వ‌ల్ప తీవ్ర‌త క‌లిగి ఉండ‌టం కొంత ఊర‌టనిచ్చే అంశం. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని అధ్య‌యనాలు చెబుతున్నాయి. అయితే ఈ విష‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (who) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఒమిక్రాన్‌ను అస్స‌లు తేలికగా తీసుకొవ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. ఎయిమ్స్ జోదాపూర్‌లో ప‌ని చేస్తున్న మ‌రో డాక్ట‌ర్ తన్మయ్ మోతీవాలా కూడా ఈ కొత్త వేరియంట్ పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు  ఇచ్చిన ఇంట‌ర్వూలో ఆయ‌న ప‌లు వ్యాఖ్యాలు చేశారు. ఆయ‌న పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తుండ‌గా.. బుధ‌వారం నాడు ఆ డాక్ట‌ర్ కు బుధ‌వారం కోవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది.  ప్రస్తుతం అతను ఐసోలేషన్‌లో ఉన్నాడు. ‘‘నేను ఐసీయూలోని ఓ పేషెంట్ కు ట్రీట్మెంట్ ఇచ్చాను. త‌రువాత తేలిక‌పాటి తలనొప్పి వచ్చింది. చాలా నీరసంగా అనిపించింది. అది ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌ధాన ల‌క్ష‌ణం. వెంట‌నే నేను క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాను’’ అని ఆయ‌న చెప్పారు. 

భార‌త్‌లోని ప‌లువురు డాక్ట‌ర్ల‌కు క‌రోనా సోకిన‌ట్టుగా వ‌స్తున్న నివేదిక‌ల‌పై డాక్ట‌ర్ మోతీవాలా స్పందించారు.  వైద్య సిబ్బందికి బూస్ట‌ర్ డోసులు ఇవ్వాల‌ని చెప్పిన‌ప్పుడు, దాని కోసం షెడ్యూల్ రూపొందించామ‌ని అయితే ఆ స‌మ‌యంలోపే వేవ్ వ‌చ్చేసిందని ఆవేదన వ్య‌క్తం చేశారు. ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే అధిక రేట్లు వేగంగా వ్యాపిస్తుంద‌ని, అందుకే అది త్వ‌ర‌గా డాక్ట‌ర్ల‌కు సోకుతోంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. తాను రెండో వేవ్ స‌మ‌యంలో కూడా సేవ‌లందిచాన‌ని, ఆ స‌మ‌యంలో కూడా డాక్ట‌ర్లు కోవిడ్ (covid) బారిన ప‌డ్డారు. అయితే ఈ సారి కొంత ఎక్కువ సంఖ్య‌లోనే దాని బారిన ప‌డుతున్నార‌ని తెలిపారు.  కొన్ని చోట్ల డిపార్ట్ మెంట్ మొత్తం డాక్ట‌ర్లకు పాజిటివ్ గా తేలుతోంద‌ని, ఇది ఆందోళ‌న‌క‌ర‌మ‌ని చెప్పారు. 

మంచి రోగనిరోధక శక్తి ఉన్న కొంతమందికి, లక్షణాలు స్వల్పంగా ఉండవచ్చ‌ని తెలిపారు. కానీ వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి, రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న వారికి ఈ వేరియంట్ ప్రాణంత‌కం అయ్యే అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్పారు. అయితే రోగ‌నిదోక‌శ‌క్తి అధికంగా ఉన్న వారు ఈ ఒమిక్రాన్ నుంచి త‌ప్పించుకున్నా.. త‌మ ఆత్మీయుల‌కు వ్యాధిని వ్యాపింప‌జేసే అవ‌కాశం ఉంటుద‌ని అన్నారు. కోవిడ్ సోకిన వారు కొంద‌రు హాస్పిట‌ల్‌లో చేరే ప‌రిస్థితులు వ‌స్తే మ‌రి కొంద‌రు మాములు ల‌క్ష‌ణాల‌తోనే ఇంటి వ‌ద్ద‌నే న‌యం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. రెండు వేవ్ ల నుంచి సేవ‌లు అందించి ఆరోగ్య సిబ్బంది విసిగిపోయార‌ని తెలిపారు. ద‌య‌చేసి ప్ర‌తీ ఒక్క‌రూ వ్యాక్సిన్ వేసుకొని, మాస్క్ లు ధ‌రించి,  ఇంటి వ‌ద్దే ఉంటూ హీరోలు కావాల‌ని సూచించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios