coronavirus : నేటి నుంచి వృద్ధుల‌కు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కు కరోనా వ్యాక్సిన్ ప్రికాషనరీ డోసు

60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు నేటి నుంచి ప్రికాషనరీ డోసు అందించనున్నారు. దీని కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్లు అవసరం లేదు. నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవచ్చు. అయితే కచ్చితంగా రెండో డోసు వేసుకొని 90 రోజులు దాటి ఉండాలి. 

Coronavirus : Corona Vaccine Precautionary Dose for Front Line Warriors, Adults' From Today

కోవిడ్ -19 (covid- 19) కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ (vaccination) ప్ర‌క్రియ వేగ‌వంతం చేసింది. ఇటీవలే దేశ ప్ర‌జ‌ల‌కు 150 కోట్లు క‌రోనా (corona)  వ్యాక్సిన్ డోసులు అందాయి. ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (pm narendra modi)  రెండు రోజుల కింద‌ట ప్ర‌క‌ట‌న చేశారు. వ్యాక్సిన్ అందించ‌డం వ‌ల్ల క‌రోనా సోక‌కుండా ఉంటుంది. ఒక వేళ సోకినా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు, స్వ‌ల్ప తీవ్ర‌త ఉండే అవ‌కాశం ఉంది. హాస్పిట‌ల్‌లో (hospital) చేరే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి సాధ్య‌మైనంత మందికి త్వ‌ర‌గా వ్యాక్సిన్ వేయాల‌ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. అంద‌రికీ వ్యాక్సిన్ వేయ‌డం వ‌ల్ల హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగి క‌రోనాను త‌ట్టుకునే శ‌క్లి ల‌భిస్తుంద‌ని ప్ర‌భుత్వాలు భావిస్తున్నాయి. 

క‌రోనా నుంచి టీనేజ్ (teenage) పిల్ల‌ల‌ను, వృద్ధుల‌ను ర‌క్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. 15-18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సిన్ అందించాల‌ని భావించింది. ఇంత వ‌ర‌కు 18 ఏళ్లు పైబ‌డిన వారికి మాత్ర‌మే వ్యాక్సిన్ అందిస్తూ వ‌చ్చారు. కేంద్ర ప్ర‌భుత్వ కొత్త నిర్ణ‌యంతో జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ అందిచండం ప్రారంభించారు. అలాగే కోవిడ్ రిస్క్ అధికంగా ఉండే వృద్ధుల‌కు, క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ (corona front line wariars)  కు అధ‌నంగా మ‌రో డోసు ఇవ్వాల‌ని భావించింది. అయితే దీనిన బూస్ట‌ర్ డోసు అని పేర్కొన‌కుండా.. ప్రికాష‌న‌రీ డోసు (precautionary dose)  అని కేంద్ర ప్ర‌భుత్వం చెప్పింది. 

ఈ ప్రికాష‌న‌రీ డోసు నేటి నుంచి ప్రారంభ‌మ‌వుతోంది. దీని కోసం ఎలాంటి రిజిస్ట్రేష‌న్లు అవ‌స‌రం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌టే స్ప‌ష్టం చేసింది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు నేడు వ్యాక్సిన్ అందించ‌నున్నారు. దీని కోసం వ్యాక్సిన్ తీసుకునే వారు నేరుగా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ కు వెళ్ల‌వ‌చ్చు. డాక్ట‌ర్ నుంచి ఎలాంటి  ధృవీక‌ర‌ణ ప‌త్రం తీసుకోవాల్సిన అస‌వ‌రం లేదు. అయితే 60 ఏళ్లు పైడిన వారు, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌తున్న వారు వ్యాక్సిన్ వేసుకునే ముందు డాక్ట‌ర్ స‌ల‌హా మాత్రం త‌ప్ప‌కుండా తీసుకోవాలి. 

గతంలో రెండు డోసుల స‌మ‌యంలో ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో ఇప్పుడు కూడా అదే రకం వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే రెండో డోసు పూర్త‌యిన 90 రోజులు లేదా 39 వారాలు నిండిన త‌రువాతే ఈ ప్రికాష‌న‌రీ డోసు వేసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఈ విష‌యంలో టీకా వేసుకునే వారు ముందుగా నిర్దారించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రికాష‌న‌రీ డోసుకు అర్హులైన వారంర‌దికీ కోవిన్ (CoWIN) నుంచి మెసేజ్‌లు వ‌స్తాయి. అర్హులైన వారిలో రెండో డోసు వేసుకొని 90 రోజుల వారికి ఇలా మెసేజ్ లు రానున్నాయి.  ఇదిలా ఉండ‌గా 15-18 ఏళ్ల మధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 2 కోట్లకు పైగా (2,27,33,154) తొలి డోస్‌లు వేశారు. దీంతో శ‌నివారం నాటికి మొత్తం 151.47 కోట్ల వ్యాక్సిన్ డోసులు దేశ ప్ర‌జ‌ల‌కు అందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎన్నిక‌ల సిబ్బంది కూడా.. 
త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే సిబ్బందిని కూడా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కేట‌గిరిలీ చేర్చాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు 
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఎన్నిక‌ల సిబ్బందిని కేట‌గిరిలో చేర్చాల‌ని అందులో స్ప‌ష్టం చేశారు. దీంతో వారికి కూడా ప్రికాష‌న‌రీ డోసు అంద‌నుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios