coronavirus : కరోనా సోకుతుందనే భయంతో కొడుకును కారు డిక్కిలో కుక్కిన తల్లి..

తన కుమారుడి నుంచి ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. 13 ఏళ్ల పిల్లాడిని కారు డిక్కిలో కుక్కి కరోనా టెస్టింగ్ సెంటర్ కు తీసుకెళ్లింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 

Coronavirus : A mother who frightened her son in a car collision.

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విళ‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. 2019 సంవ‌త్స‌రంలో వెలుగులోకి వ‌చ్చిన ఈ వైర‌స్ మానవుల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక వేవ్ లు వ‌చ్చిపోతున్నాయి. వ‌చ్చిన ప్ర‌తీ సారి ఆర్థిక న‌ష్టాల‌ను, ప్రాణ న‌ష్టాల‌ను మిగులుస్తోందీ ఈ మహ‌మ్మారి. ఇప్పుడు ఇండియాలో మూడో వేవ్ మొద‌లైంది. చాలా దేశాల్లో మూడో వేవ్ ఎప్పుడో వ‌చ్చి వెళ్లింది. 

క‌రోనా నుంచి ర‌క్షించుకోవ‌డానికి ఎన్ని మందులు వ‌చ్చినా, ఎన్ని వ్యాక్సిన్ లు వ‌చ్చినా.. ప్ర‌జ‌ల్లో మాత్రం ఇంకా క‌రోనా భ‌యం చావ‌డం లేదు. క‌రోనా గురించి ఆందోళ‌న చెందాల్సిన అస‌వ‌రం లేద‌ని, జాగ్ర‌త్త‌లు పాటిస్తే సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. అయినా క‌రోనా అంటే తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. గ‌త వేవ్ ల స‌మ‌యంలో త‌మ ఆత్మీయుల ప‌రిస్థితిని ద‌గ్గ‌ర‌గా చూసిన వారు ఇంకా కోవిడ్ భ‌యం నుంచి తేరుకోలేక‌పోతున్నారు. 

కోవిడ్ త‌మ ఆత్మీయుల‌ను కూడా ఇబ్బందుల‌కు గురి చేసేంత‌లా భ‌య‌పెడుతోంద‌న్నది తెలిపే ఘ‌ట‌న అమెరికాలో వెలుగులోకి వ‌చ్చింది. ఓ త‌ల్లికి తన కుమారుడికి క‌రోనా సోకిందేమో అని అనుమానం వ‌చ్చింది. అయితే ప‌రీక్ష‌లు నిర్వ‌హించానికి క‌రోనా టెస్టింగ్ సెంట‌ర్‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. అయితే త‌న కుమారుడి వ‌ల్ల త‌న‌కు ఎక్క‌డ క‌రోనా సోకుతుందో అనే భ‌యంతో పిల్లాడిని కారు డిక్కిలో కుక్కింది. అలాగే కారు తీసుకొని క‌రోనా టెస్టింగ్ సెంట‌ర్ కు వెళ్లింది. ఎవ‌రికి క‌రోనా టెస్ట్ చేయాల‌ని అక్క‌డి సిబ్బంది ఆ త‌ల్లిని అడిగారు. దీంతో వెంట‌నే కారు డిక్కీ ఓపెన్ చేసింది ఆ త‌ల్లి. అందులో చిక్కి ఉన్న పిల్లాడిని చూసి అక్క‌డి సిబ్బంది నివ్వెర‌బోయారు. డిక్కిలో నుంచి పిల్లాడిని బ‌య‌ట‌కు తీయాల‌ని సిబ్బంది ఆమెను కోరారు. దీనికి ఆమె నిరాక‌రించింది. కారు డిక్కి క్లోజ్ చేసి మ‌ళ్లీ వేగంగా కారును అక్క‌డి నుంచి తీసుకెళ్లింది. దీంతో క‌రోనా టెస్టింగ్ సెంట‌ర్ సిబ్బంది పోలీసుల‌కు సమాచారం అందించారు. 

యూఎస్ఏలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యారిస్‌ కౌంటీలో సారా బీమ్ నివ‌సిస్తోంది. ఆమె టీచ‌ర్ గా ప‌ని చేస్తోంది.  ఆమెకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఆ పిల్లాడికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో కోవిడ్ సోకిందేమోన‌ని త‌ల్లి సారా బీమ్ కు అనుమానం క‌లిగింది. క‌రోనా అంటే విప‌రీత‌మైన భ‌యం ఉన్న ఆమెకు.. త‌న కుమారుడి ద్వారా ఎక్క‌డ త‌న‌కు వ్యాధి సోకుతుందోన‌ని భ‌య‌ప‌డింది. అయితే వ్యాధిని నిర్ధారించుకోవ‌డానికి టెస్టింగ్ సెంట‌ర్ కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ త‌న‌కు ఎక్క‌డ క‌రోనా సోకుతుంద‌నే భ‌యం వెంటాడుతూనే ఉంది. దీంతో ఆమెకు ఓ ఆలోచ‌న వ‌చ్చింది.

13 ఏళ్ల త‌న కుమారుడిని కారు డిక్కీలో ప‌డుకోబెట్టి టెస్టింగ్ సెంట‌ర్ కు వెళ్లాల‌ని భావించింది. అనుకున్న‌ట్టుగానే కొడుకును డిక్కిలో కుక్కింది. కారు తీసుకొని నేరుగా టెస్టింగ్ సెంట‌ర్ కు వెళ్లింది. కారు డిక్కిలో కుమారుడు ఉన్నాడ‌ని టెస్ట్ చేయాల‌ని అక్క‌డి సిబ్బందికి చెప్పింది. ఈ విష‌యం సిబ్బంది షాక్ అయ్యారు. పిల్లాడిని అందులో నుంచి తీయాల‌ని చెప్పినా సారా బీమ్ తీయ‌లేదు. కారు తీసుకొని వేగంగా అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఈ విష‌యాన్ని హ్యారిస్‌ కౌంటీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమెకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios