corona virus : కోవిడ్ -19 ముగియలేదు. మరిన్ని వేరియంట్లు వచ్చే అవకాశం ఉంది - డబ్లూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్..
కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని డబ్లూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని అన్నారు. అందరూ తప్పనిసరిగా ఇప్పుడు పాటిస్తున్న జాగ్రత్తలను మరి కొన్ని రోజుల పాటు కొనసాగించాలని సూచించారు.
కోవిడ్ -19 (covid -19) ఇంకా ముగిసిపోలేదని మరిన్ని వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని డబ్లూహెచ్ వో (WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ (Soumy swaminathan) అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో వచ్చే కరోనావైరస్ వేరియంట్‌ల గురించి హెచ్చరించారు. ‘‘ వైరస్ పరిణామం చెందడం, పరివర్తన చెందడం మనం గమనించాం. కాబట్టి మరిన్ని వైవిధ్యాలు, ఆందోళనకరమైన రకాలు ఉంటాయని తెలుసు. ఇప్పుడే మహమ్మారి ముగింపు దశలో ఉన్నామని చెప్పలేం ’’ అని చెప్పారు.
WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ (Tedros Adhanom Ghebreyesus)తో కలిసి వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ ప్రకటన చేశారు. ఇటీవలే WHO కు చెందిన ఓ సీనియర్ అధికారి కూడా మరి కొన్ని కొత్త వేరియంట్‌ల అవకాశం ఉందని తెలిపారు. ఒమిక్రాన్ చివరి వేరియంట్ (Omicron) చివరి స్ట్రెయిన్ కాదని హెచ్చరించారు.
కొత్త COVID-19 వేరియంట్‌లను ‘‘ వైల్డ్ కార్డ్ ’’గా పేర్కొంటూ WHO COVID-19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్‌ఖోవ్, గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ ఒమిక్రాన్ నాలుగు విభిన్న వెర్షన్‌లను ట్రాక్ చేస్తోందని సౌమ్య స్వామినాథన్ చెప్పారు. ‘‘ ఈ వైరస్ గురించి మాకు చాలా తెలుసు, కానీ ప్రతీ విషయం తెలియదు. ఈ వేరియంట్‌లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాంటివి. కాబట్టి మేము ఈ వైరస్‌ని నిజ సమయంలో ట్రాక్ చేస్తున్నాం. ఎందుకంటే అది మారుతున్నప్పుడు పరివర్తన చెందుతుంది.Omicron వేరియంట్ తాజా స్ట్రెయిన్. అయితే ఇదే చివరి రూపాంతరం కాదు.’’ అని ఆమె చెప్పారు. అయితే కోవిడ్ -19 ను అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
ఇదిలా ఉండగా సౌమ్య స్వామినాథన్ శుక్రవారం మరో మీడియా సంస్థతో మాట్లాడారు. కోవిడ్ -19 (covid -19) ల్యాబ్ లో పుట్టిందా అని మీడియా అడిగిన ప్రశ్నను ఆమె తోసిపుచ్చారు. ఈ విషయంలో తాము ఏమీ చెప్పలేమని అన్నారు. ఎందుకంటే ల్యాబ్ (lab) నుంచి లీకైందన్న విషయంలో బలమైన సాక్ష్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. చైనాకు వెళ్ళిన శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది ఇది జంతువుల నుంచి వచ్చినట్లు ఎక్కువగా భావించారని తెలిపారు. అది అడవి జంతువు కావచ్చు లేదా పెంపుడు జంతువు కావచ్చు లేదా పక్షి, గబ్బిలం కూడా కావచ్చని అన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. తాము డేటాను పూర్తిగా పరిశీలించాల్సిన అసవరం ఉందని అన్నారు. చైనాలో ఈ విషయంలో మరిన్ని అధ్యయనాలు చేయాలని చెప్పారు.
కరోనా ఎప్పుడు ముగిసిపోతుందనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. దీనికి ఎవరూ సరైన సమాధానం చెప్పలేరని తెలిపారు. ప్రస్తుతం కొంతమంది చేస్తున్నట్టుగా మహమ్మారి ముగిసిందని ప్రకటించడం సరైంది కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకాలం అందరం తీసుకుంటున్న జాగ్రత్తలన్నింటినీ కొనసాగించాలని, ఎవరూ దానిని వదులకోవద్దని చెప్పారు. కాకపోతే ఈ ఏడాది చివరి నాటికి కొంత మెరుగైన స్థితిలో ఉంటామని అన్నారు.