corona virus : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు కోవిడ్ పాజిటివ్
తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు కరోనా సోకింది. జ్వరం, జలుబు ఉండటంతో ఆయనకు డాక్టర్ కరోనా టెస్ట్ చేశారు. ఇందులో కోవిడ్ -19 సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.
కరోనా విజృంభన కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తాజాగా తెలంగాణ ప్రాణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. జ్వరం, జలుబు ఉండటంతో ఆయనకు డాక్టర్ కరోనా టెస్ట్ చేశారు. ఇందులో కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.
కరోనా సోకిన విషయాన్ని బోయినపల్లి వినోద్ కుమార్ నిర్ధారించారు. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్లు కోవిడ్ టెస్ట్ చేశారని చెప్పారు. దీంతో కరోనా పాజిటివ్ గా తేలిందని అన్నారు. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే తాను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకొని హోం ఐసోలేషన్ లో ఉన్నానని పేర్కొన్నారు. ఇటీవల తనతో కాంటాక్ట్ అయిన వారందరూ కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని అన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
నేడు మాజీ ప్రధాని, జనతాదల్ (సెక్యులర్) అధ్యక్షుడు దేవ గౌడ్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనకు లక్షణాలు ఏమి లేవు. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నాలుగు రోజుల కిందట తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కూడా కరోనా సోకింది. దీంతో ఆయన చికిత్స కోసం హాస్పిటల్ లో చేరారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను సురక్షితంగా తిరిగి వస్తానని ఆయన పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ కు రోజుల వ్యవధి తేడాతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిద్దరూ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు. తమని కలిసి వారందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.