corona virus : ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కోవిడ్-19 పాజిటివ్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కు క‌రోనా సోకింది. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేధిక‌గా ఈ విష‌యాన్ని పంచుకున్నారు. త‌నకు కోవిడ్ -19 పాజిటివ్ గా తేలింద‌ని పేర్కొన్నారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. 

corona virus: covid-19 positive for NCP chief Sharad Pawar

కరోనా కలవర పెడుతోంది. రోజు రోజుకు దేశంలో కేసులు పెరుగుతున్నాయి. 2019లో వెలుగులోకి వచ్చిన ఈ మ‌హమ్మారి ఇప్ప‌టికీ మ‌న‌ల్ని వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే రెండు వేవ్ లు దేశాన్ని కుదిపేశాయి. ఇప్పుడు మ‌ళ్లీ మూడో వేవ్ కొన‌సాగుతోంది. ఇప్పుడిప్పుడే అన్ని స‌ద్దుకుంటున్నాయి, జ‌న జీవ‌నం మ‌ళ్లీ గాడిలో ప‌డుతోంద‌ని అని అనుకుంటున్న స‌మ‌యంలో ఈ థ‌ర్డ్ వేవ్ వ‌చ్చేసింది. దీంతో మ‌ళ్లీ క‌రోనా క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. 

ఈ థ‌ర్డ్ వేవ్ లో కోవిడ్ -19 ఒమిక్రాన్ వేరియంట్ (omicron veriant) ఎక్కువ‌గా వ్యాపిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ అన్ని దేశాల‌కు విస్త‌రిస్తోంది. ఈ కొత్త వేరియంట్ మ‌న దేశంలో గ‌తేడాది డిసెంబ‌ర్ రెండో తేదీన గుర్తించారు. క‌ర్నాట‌క‌లో మొద‌టి రెండు కేసులను కనుగొన్న‌ప్ప‌టికీ ఇప్పుడు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కేసులు ఉన్నాయి. అయితే ఈ ఒమిక్రాన్ కేసుల స్వ‌ల్ప తీవ్ర‌త‌ను, స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటోంద‌ని అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేస్తాయి. కానీ ఈ వేరియంట్ ప‌ట్ల ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగా ఉండొద్ద‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ‌రినీ వ‌ద‌లడం లేదు. సామాన్యుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు అంద‌ర్నీ ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ncp) చీఫ్ శరద్ పవార్ (sharath pawar) క‌రోనా బారిన పడ్డారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేధిక‌గా ఈ విష‌యాన్ని పంచుకున్నారు. త‌నకు కోవిడ్ -19 పాజిటివ్ గా తేలింద‌ని పేర్కొన్నారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ‘‘నా వైద్యుడు సూచించిన విధంగా నేను చికిత్స పొందుతున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారందరూ కరోనా పరీక్ష‌లు నిర్వ‌హించుకోవాలి. దీంతో పాటు అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. 

ఇదిలా ఉండ‌గా.. మాజీ ప్ర‌ధానమంత్రి, జ‌న‌తాదళ్ (సెక్యుల‌ర్) అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ‌ (HD Deve gouda) కు కూడా ఆదివారం క‌రోనా పాజిటివ్ (corona possitive)  గా  నిర్ధార‌ణ అయ్యింది. అయితే ఆయ‌న‌కు ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు. ప్ర‌స్తుతం దేవెగౌడ ఆరోగ్యం నిల‌క‌డగానే ఉంది. ఈ మేర‌కు ఆయ‌న కార్యాల‌య సిబ్బంది నిన్న మీడియాతో వివ‌రాలు వెల్ల‌డించారు.  హెచ్‌డీ దేవెగౌడ జూన్ 1996 నుంచి ఏప్రిల్ 1997 వరకు భారతదేశానికి 12వ ప్రధానమంత్రిగా పనిచేశారు. అతను గతంలో 1994 నుంచి 1996 వరకు కర్ణాటకకు 14వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు. అలాగే తెలంగాణ ప్రాణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన‌పల్లి వినోద్ కుమార్ కు ఆదివారం క‌రోనా సోకింది జ్వరం, జలుబు ఉండటంతో ఆయ‌న‌కు డాక్ట‌ర్ క‌రోనా టెస్ట్ చేశారు. ఇందులో క‌రోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఆయ‌న హోం ఐసోలేష‌న్ లోకి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం తాను అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని హోం ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల త‌నతో కాంటాక్ట్ అయిన వారంద‌రూ కరోనా ప‌రీక్షలు నిర్వ‌హించుకోవాల‌ని సూచించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios