ఒమిక్రాన్ సోకిన వారిలో 91 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ పొందినవారే..- కేంద్ర ఆరోగ్య శాఖ
ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో ఎక్కువ శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ పొందిన వారే ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో పలువురు బూస్టర్ డోసులు పొందిన వారు కూడా ఉన్నారని చెప్పింది.
ఒమిక్రాన్ కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికాలో మొదటగా వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 38 దేశాలకు ఈ కొత్త వేరియంట్ వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. ఈ కొత్త వేరియంట్ వల్ల యూకే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతీ రోజూ యూకేలో 10 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. ఇతర కోవిడ్ - 19 కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. భారత్‌లో కూడా ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. డిసెంబర్ రెండో తేదీన కర్నాటకలో మొదటి రెండు కేసులను గుర్తించారు. అప్పటి నుంచి మెళ్లగా పెరుగుతూ నేటి వరకు ఆ సంఖ్య మూడు వందలను డాటింది.
దేశంలో ఫిబ్రవరిలో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభణ.. ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనం..
పెరుగుతున్న కేసుల సంఖ్య..
ఈ నెల మొదటి వారంలో రెండు కేసులు గుర్తించినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో ప్రతీ రోజు కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి భారత్ లో 358 కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో అధికం శాతం మంది వ్యాక్సిన్ వేసుకున్న వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో నమోదైన 358 కేసుల్లో 91 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ పొందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం తెలిపింది. కేవలం 7 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ పొందని వారు ఉన్నారని పేర్కొంది. ఈ ఒమిక్రాన్ సోకిన వారిలో ముగ్గురు బూస్టర్ డోసులు పొందిన వారు ఉండటం గమనార్హం. ఇలా పూర్తిగా వ్యాక్సిన్ ద్వారా రక్షణ పొందిన వారు కూడా ఈ కొత్త వేరియంట్ సోకడం కలవరపెట్టే అంశం. అయితే ఇందులో 70 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది.
అర్ధరాత్రి మహిళ మంచం మీద కూర్చొని పాదాలను తాకడం ఆమె మోడెస్టీని దెబ్బతీయడమే.. హైకోర్టు సంచలన తీర్పు
ఒమిక్రాన్ వేరియంట్ సోకిన 358 కేసులకలో 183 మందిపై అధ్యయనం చేసి ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ 183 మందిలో 87 మంది రెండు టీకాలు పొందగా.. ఇద్దరు ఒకే డోసు పొందిన వారు ఉన్నారు. మిగిలిన 23 మంది ఎలాంటి డోసు పొందలేదని తెలిపింది. 70 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని, 30 శాతం మందికి మాత్రమే లక్షణాలు ఉన్నాయని పేర్కొంది. 73 శాతం మంది ఓమిక్రాన్ కేసులకు ట్రావెల్ హిస్టరీ ఉందని తెలిపింది. 27 శాతం మందికి ఫారెన్ ట్రావెల్ హిస్టరీ లేదని చెప్పింది. 44 కేసులు విదేశీ ప్రయాణికులతో సంబంధం ఉందని అన్నారు. 18 కేసుల వివరాలు ఇంకా అందుబాటులోకి లేవని తెలిపింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ రికవరీల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. ఇప్పటి వరకు 144 మంది కోలుకున్నారు. అయితే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటకల రాష్ట్రాలు అత్యధిక ఒమిక్రాన్ యాక్టివ్ కేసులు కలిగి ఉన్నాయి.