Asianet News TeluguAsianet News Telugu

coronavirus : క‌రోనా క‌ల‌క‌లం.. 60 మంది పాటియాలా లా యూనివర్సిటీ స్టూడెంట్ల‌కు కోవిడ్

కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన రెండు రోజుల్లో పాటియాలాలోని లా యూనివర్సిటీకి చెందిన 60 మంది స్టూడెంట్లు కరోనా పాజిటివ్ గా తేలారు. ఇది ఆందోళన కలిగిస్తోంది. 

60 Patiala Law University Students were tested positive for covid
Author
New Delhi, First Published May 5, 2022, 9:24 AM IST

పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా (RGNUL)కి చెందిన 60 మంది స్టూడెంట్ల‌కు క‌రోనా సోకింది. అంత మంది స్టూడెంట్ల‌కు ఒకే సారి క‌రోనా సోక‌డం యూనివ‌ర్సిటీలో క‌ల‌క‌లం రేపింది. దీంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. 

కోవిడ్ పాజిటివ్ గా తేలిన స్టూడెంట్లంద‌రికీ స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయి. వారంద‌రినీ ప్రత్యేక బ్లాక్‌లలో ఒంటరిగా ఉంచారు. గ‌డిచిన రెండు రోజుల్లోనే ఇంత మంది స్టూడెంట్లు క‌రోనా బారిన ప‌డ్డార‌ని యూనివ‌ర్సిటీ వ‌ర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండ‌గా కోవిడ్ -19 సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి మే 10 లోపు హాస్టళ్లను ఖాళీ చేయాలని విశ్వవిద్యాలయ అధికారుల మిగితా  స్టూడెంట్ల‌ను కోరారు.

క‌రోనా వ్యాప్తి ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో RGNUL కోవిడ్ కమిటీ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ స‌మావేశంలో వైద్య నిపుణులు స‌ల‌హాల ప్ర‌కారం ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఎండ్-టర్మ్ పరీక్షలు వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం మ‌ళ్లీ షెడ్యూల్ రూపొందించ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆఫ్ లైన్ లో కొన‌సాగిన క్లాస్ లు మిగితా సిల‌బ‌స్ కంప్లీట్ అయ్యే వ‌ర‌కు ఆన్ లైన్ లో కొన‌సాగుతాయి. 

ఈ విష‌యంలో యూనివ‌ర్సిటీ అడ్మినిస్ట్రేష‌న్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో లా నాలుగో సంవ‌త్స‌రం చ‌దువుతున్న 44 మంది స్టూడెంట్ల‌కు మంగ‌ళ‌వారం క‌రోనా సోకింద‌ని, వీరి రిపోర్టులు బుధ‌వారం ఉద‌యం వ‌చ్చాయ‌ని తెలిపారు. మిగిలిన స్టూడెంట్లను కోవిడ్ నుంచి దూరంగా ఉంచ‌డానికి హాస్ట‌ల్స్ ను ఖాళీ చేయాల‌ని సూచించామ‌ని తెలిపారు. స్టూడెంట్లు అంద‌రూ కలిసి మెలిసి అక్కడక్కడే తిరుగుతూ ఉంటార‌ని చెప్పారు. అందుకే క‌రోనా వ్యాప్తి జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. దీనిని నివారించ‌డానికే స్టూడెంట్ల‌కు హాస్ట‌ల్స్ ఖాళీ చేయ‌ల‌ని చెప్పామ‌ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios