Asianet News TeluguAsianet News Telugu

corona virus : క‌రోనా క‌ల‌క‌లం.. భార‌త్ లో కొత్త‌గా 16 వేల కేసులు.. 68 మ‌ర‌ణాలు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,815 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వల్ల 68 మంది చనిపోయారు. 

16000 new cases of Corona in India, 68 deaths
Author
First Published Aug 13, 2022, 2:36 PM IST

భార‌త్ క‌రోనాలో క‌ల‌క‌లం రేపుతోంది. గ‌త కొంత కాలం నుంచి త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు.. ఇటీవ‌ల నుంచి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో దాదాపు 16 వేల కొత్త కోవిడ్ కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే క‌రోనా వ‌ల్ల 68 మ‌రణాలు సంభ‌వించాయి. ఈ వివ‌రాల‌ను కేంద్ర మంత్రిత్వ శాఖ శ‌నివారం అధికారికంగా వెల్ల‌డించింది. 

Salman Rushdie: అందుకే సల్మాన్ రష్దీ పుస్తకాన్ని బ్యాన్ చేశాం.. రష్దీ అద్భుత రచయిత: కేంద్ర మాజీ మంత్రి నట్వర్

ఈ ఉద‌యం 8 గంటల వ‌ర‌కు అప్ డేట్ చేసిన డేటా ప్ర‌కారం.. దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 1,19,264కి చేరుకున్నాయి. ఇది మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.27 శాతంగా ఉంది. కొత్తగా 15,815 కరోనా వైరస్ కేసులు, 68 మరణాలతో క‌లుపుకొని దేశంలో మొత్తంగా 4,42,39,372 కేసులు అయ్యాయి. తాజాగా క‌రోనా వ‌ల్ల చ‌నిపోయిన వారి సంఖ్య‌తో క‌లుపుకొని దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,26,996 కు చేరుకున్నాయి. 

జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.54 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.36 శాతంగా నమోదు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.79 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా న‌మోదైంది. తాజా డేటా ప్ర‌కారం.. క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,35,93,112 కు పెరిగింది. దేశ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 207.71 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ల‌ను అందించారు. 

'ప్ర‌త్యేక సేన భ‌వ‌న్' ఏర్పాటు యోచ‌న‌లో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే

భారతదేశలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 7వ తేదీ నాటికి 20 లక్షలు, ఆగస్టు 23వ తేదీ నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5వ తేదీ నాటికి 40 లక్షలు, సెప్టెంబర్ 16వ తేదీ నాటికి 50 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28వ తేదీ నాటికి 60 లక్షలు, అక్టోబర్ 11వ తేదీ నాటికి 70 లక్షలు, అక్టోబర్ 29వ తేదీ నాటికి 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. గ‌తేడాది మే 4వ తేదీన కోవిడ్ -19 కేసులు రెండు కోట్లుగా న‌మోదు అయ్యాయి. అలాగే జూన్ 23వ తేదీన మూడు కోట్లు కేసులుగా రికార్డుల‌కు ఎక్కింది. కాగా ఈ ఏడాది జనవరి 25వ తేదీన మొత్తం నాలుగు కోట్ల కేసులు దాటాయి.

సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్.. మూడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి..

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాల‌కు ఇటీవ‌ల లేఖ‌లు రాసింది. రాష్ట్రంలో త‌గినంత‌గా పరీక్షలు నిర్వహించాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా ప్ర‌జ‌లు ప్రోత్స‌హించాల‌ని ఆదేశించింది. రాబోయే రోజుల్లో వివిధ ఉత్సవాల కారణంగా సామూహిక సమావేశాలు జరిగే అవకాశం ఉంద‌ని పేర్కొంది. కాబ‌ట్టి త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios