లాక్ డౌన్ సమయంలో కూడా మీరు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు ...
భారతదేశంలో, ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. దీని వల్ల ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతి లేదు. ప్రయాణాలకు కూడా అనుమతి లేదు.అయితే మనలో చాలా మంది ఇంటి పరిస్థితికి, పనులకు అనుగుణంగా సర్దుకుంటున్నాము, కొందరు ఇలాంటి పరిస్థితులను ఎదురుకోవడానికి చాల ఇబ్బందులు పడుతున్నారు .
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని భయాందోళగురినకు గురి చేస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిని వణికిస్తోంది.కరోనావైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కూడా అమలులోఉంది. ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కరోనావైరస్ దెబ్బకి కుదేలవుతోంది.
భారతదేశంలో, ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. దీని వల్ల ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతి లేదు. ప్రయాణాలకు కూడా అనుమతి లేదు. అయితే మనలో చాలా మంది ఇంటి పరిస్థితికి, పనులకు అనుగుణంగా సర్దుకుంటున్నాము, కొందరు ఇలాంటి పరిస్థితులను ఎదురుకోవడానికి చాల ఇబ్బందులు పడుతున్నారు .
అయితే లాక్ డౌన్ కారణంగా ప్రతిఒక్కరికీ సాధారణమైన ఆందోళన ఏమిటంటే, పండ్లు, కూరగాయలు, కిరాణా వంటి రోజువారీ నిత్యావసరాల లభ్యత గురించి.
మాల్స్, థియేటర్లు ఇంకా ఇతర బహిరంగ ప్రదేశాలు మూసివేయడంతో ప్రజలు ఈ సమయాల్లో బయటికి వెళ్లలేక ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ లాక్డౌన్ నుండి బయటపడటానికి సహాయపడే 5 నిత్యావసరాల జాబితాను మేము అందిస్తున్నాము.
రోజు ఉపయోగపడే నిత్యావసర కిరాణా సరుకులు
ప్రతిఒక్కరికీ ఇది మనసులో ఉండే మొదటి ఆందోళన, కానీ మంచి విషయం ఏమిటంటే ఆన్‌లైన్ సేవలు ప్రతిరోజూ ప్రజలకు అవసరమైన వాటిని అందుబాటులో ఉంచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. సుపర్‌డైలీ, బిగ్‌బాస్కెట్, అమెజాన్ ఫ్రెష్, డన్జో వంటి సేవలు ఆన్‌లైన్‌లో అవసరమైన కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయడానికి ప్రజలను అనుమతిస్తున్నాయి.
కానీ పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా సరఫరా చేయడం సాధ్యపడుతుంది. మాగీ, పాస్తా, రామెన్, గోధుమ పిండి, బియ్యం, పప్పుధాన్యాలు వంటి సరుకుల స్టాక్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ సేవలను ముంబై, బెంగళూరు, ఎన్‌సిఆర్, వంటి నగరాల్లో పొందవచ్చు, ఈ సేవలకు సంబంధించి పూర్తి వివరాలకు వారి వెబ్‌సైట్‌లను సందర్శించండి.
also read 2 నెలల్లో 48 బిలియన్లకు పడిపోయినా ముఖేష్ అంబానీ సంపద...
ఆన్‌లైన్ రీఛార్జీలు
లాక్ డౌన్ విధించినప్పటి నుండి, ప్రతి రోజు వాయిస్, వీడియో కాల్స్ చాల పెరిగాయి. ప్రజలు టీవీ చూడటానికి కేటాయించే సమయం కూడా పెరిగింది. గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇటువంటి పేమెంట్స్, రీఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయడం వల్ల మీరు ఎవరిని సంప్రదించకుండా చేసుకోవచ్చు,అలాగే సామాజిక దూరానికి కూడా కట్టుబడి ఉండొచ్చు.
ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్, పోస్ట్-పెయిడ్ మొబైల్ బిల్ పేమెంట్, ఇంటర్నెట్ బిల్ పేమెంట్, డిటిహెచ్ పేమెంట్, ఇతర సర్వీస్ లకు సబ్ స్క్రిప్షన్ వంటి పేమెంట్లను చాలా సులభంగా, ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. యుటిలిటీ బిల్లులు ఆన్‌లైన్‌లో కూడా చెల్లించవచ్చు, అవసరమైనప్పుడు మీరు డబ్బును స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా బదిలీ చేయవచ్చు.
మీరు ఆన్‌లైన్ లావాదేవీల గురించి తెలుసుకోవాలంటే లేదా ఇంతకు ముందు ఎప్పుడూ చేయకపోతే, మీరు దానికి సంబంధించిన వీడియోలకు కూడా చూడవచ్చు.
ఫిట్ నెస్ అండ్ వర్క్ ఔట్స్
ఈ లాక్డౌన్ వాళ్ళ ఒక ప్రధాన లోపం ఏమిటంటే, ప్రజలు వారి అధికారిక పని మినహా ఏదైనా ఇతర కార్యకలాపాలలో పాల్గొనడానికి అవకాశం లేకపోవడం. మంచి విషయం ఏమిటంటే వ్యాయామలాకు సంబంధించిన ఆన్‌లైన్ యాప్స్ చాలా ఉండటం, అవి ఎటువంటి పరికరాలు లేకుండా ఇంట్లో సులభంగా వ్యాయామలాను చేయవచ్చు.
కొన్ని యాప్స్ దీన్ని ఉచితంగా అందుబాటులో ఉంచాయి, మరికొన్నింటికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కార్డియాక్, యోగా, ధ్యానం వంటి మరెన్నో వ్యాయామలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు వారి స్నేహితులతో ఆడుకోవడానికి బయటకు వెళ్ళలేనందున అలాంటి వ్యాయామాలు కూడా పిల్లలను నిమగ్నం చేయడానికి గొప్ప మార్గం.
పెద్దల కోసం, మీరు అలాంటి వ్యాయామలతో ఆరోగ్యంగా ఉండగలరు, తద్వారా మీరు ఈ లాక్ డౌన్ సమయంలో కూడా పూర్తిగా ఆరోగ్యాంగా ఉండగలరు. దీనికి సంబంధించి కొన్ని యాప్స్ క్యూర్.ఫిట్, 30 డే ఫిట్‌నెస్ ఛాలెంజ్, స్టెప్ సెట్ గో మీరు చూడవచ్చు.
మెడిసిన్స్
లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం అందుబాటులో ఉంచవలసిన నిత్యావసరాల జాబితాలో మందులు కూడా ఉన్నాయి. మెడ్‌ప్లస్, మెడ్‌లైఫ్, ఫార్మసీ వంటి ఆన్‌లైన్ సర్వీసు ప్రొవైడర్లు మీ ఇంటి ముందుకే మందులు, సానిటైజర్స్, మాస్క్‌లు వంటి ఇతర అవసరమైన వాటిని ఆర్డర్ తీసుకుంటున్నారు. కాంటాక్ట్‌లెస్ డెలివరీని సాధ్యం చేయడానికి ఇది ఒక గొప్ప ప్రయత్నం.
ఎంటర్టైన్మెంట్ అండ్ గేమింగ్
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు ప్రజలు వాటిపై వెచ్చించే సమయాన్నికూడా పెంచాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు, గేమింగ్ లపై కూడా చాలా రెట్లు సమయం కేటాయిస్తున్నారు. ఎక్స్ బాక్స్ , ప్లే స్టేషన్ వంటి డివైజెస్ ద్వారా మాత్రమే కాదు, మొబైల్, డెస్క్‌టాప్‌లపై కూడా గేమింగ్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్లే డెస్టినీ, కౌంటర్ స్ట్రైక్, పబ్ జి వంటి కొన్నింటిలో ట్రాఫిక్‌లో భారీ పెరుగుదల కనిపించింది.
ఈ క్లిష్ట సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లాక్ డౌన్, సామాజిక దూరం అనేది మన భద్రత కోసం చాల అవసరం. మాకు ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు మాకు అనిపించినప్పటికీ, అలా ఉండడానికి మాకు కొంచెం సులభతరం చేస్తు ఈ సేవాలను అందిస్తున్న వాటికీ ధన్యవాదాలు.