ప్రభుత్వం మీ ఖాతాలో వేసే రూ.1500/- జమ అయ్యాయో లేదో ఇలా తెలుసుకోండి..

 ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాలేని పరిస్థితి, సామాజిక దూరం, ఆంక్షలతో ప్రజలు నిత్యవసరాల కొనుగోల్లకు ఇబ్బందులు తలెత్తకుండ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేషన్ సరుకులు పంపిని పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు పేడుతోంది. 

telangan govt deposits rs 1500 in jandhan bank accounts check here for details

కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ  మరింతగా క్షీణిస్తుంది. ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాలేని పరిస్థితి, సామాజిక దూరం, ఆంక్షలతో ప్రజలు నిత్యవసరాల కొనుగోల్లకు ఇబ్బందులు తలెత్తకుండ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రేషన్ సరుకులు పంపిని పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు పేడుతోంది.

రోజు వారిగా పనులకు వెళ్లేవారు, చిన్న ఉద్యోగస్థులంతా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలందరికీ రూ.1500/- వేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

అయితే వీటిని మూడు విడతలుగా నెలకు రూ.500/- గా సదరు లబ్ధిదారుల ఖాతాల్లో వేయనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా వైట్‌ రేషన్ కార్డు కలిగి ఉన్న అందరికీ రూ.1500/- వారి అకౌంట్లలో జమచేస్తోంది.

ఇప్పటికే దాదాపు అందరి అకౌంట్లలో జమచేసేసినట్లు సమాచారం. అయితే చాలా మంది ప్రజలు వారి అకౌంట్లలో ప్రభుత్వం జమచేసిన డబ్బులు జమ అయ్యాయా లేదా అన్న దానిపై తర్జన బర్జన పడుతున్నారు. ఇటువంటి వారికోసం ప్రభుత్వం

దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ వివరాలను ఈ‌పి‌ఓ‌ఎస్ (Epos) వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. సదరు లబ్దీదారులు వారి ఎకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో అన్న సమాచారం తెలుసుకునేందుకు ఆ పోర్టల్‌లో ఓ ఆప్షన్ పెట్టింది.

ఇందులో రేషన్ కార్డు నంబరు ఎంటర్‌ చేసి నగదు జమకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో లేదా బ్యాంకులకు దూరంగా ఉన్న ప్రదేశాలలో, లేదా గ్రామాలలో నివసించే మహిళలకు నగదు సంబంధిత సమాచారాన్ని ఇంటి వద్ద నుండే తెలుసుకోవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios