లాక్ డౌన్ లో పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు స్టార్టప్ కంపెనీ కొత్త ఆలోచన...

ఆలోచిస్తే మనము మనుషుల మనుగడ వైపు వెళ్తున్నట్టుంది. మన శారీరక  వ్యాయామాలు లేదా క్రీడా కార్యకలాపాలు వంటివి లేకుండానే ఉన్నామని మనం గ్రహించాలి. ఎందుకంటే ఇది మన శారీరక,మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
 

startup shapes itself during lockdown to recreate sports and fitness for India

బెంగళూరు: కరోనావైరస్ కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నందున భవిష్యత్తు పైనే అందరి కళ్ళు పడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఏదో ఒక రోజు ముగుస్తుందని మాకు తెలుసు. భారతదేశంలో కరోనావైరస్ ద్వారా మరణించిన వారి సంఖ్య 500 కన్నా ఎక్కువ, ప్రస్తుతానికి ఆక్టివ్ కేసుల సంఖ్య 15,707 పైనే ఇలాంటి పరిస్థితులలో ప్రజలు ఇంటి లోపల ఉండటమే సురక్షితం. అయితే లాక్ డౌన్ సమయంలో ప్రజలు వారి జీవనశైలిలో తాత్కాలిక మార్పులను చేసుకుంటున్నారు.


ఆలోచిస్తే మనము మనుషుల మనుగడ వైపు వెళ్తున్నట్టుంది. మన శారీరక  వ్యాయామాలు లేదా క్రీడా కార్యకలాపాలు వంటివి లేకుండానే ఉన్నామని మనం గ్రహించాలి. ఎందుకంటే ఇది మన శారీరక,మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవితంలో ఏమి జరుగుతుందో మనం నియంత్రించలేము అనేది నిజం, కాని మనం దానికి ఎలా స్పందించాలో అనేది స్పష్టంగా నియంత్రించవచ్చు.  అది మనం ఎంచుకున్న మార్గం బట్టి ఉంటుంది.


పిల్లలు, యువకులకు క్రీడా శిక్షణనిచ్చే వేదిక అయిన upugo.in ను మేము ఉదాహరణకు తీసుకున్నము.పిల్లలు తగినంత శారీరక శ్రమకు గురికావడం లేదని అప్ యు గో వ్యవస్థాపకుడు అమిత్ గుప్తా గ్రహించారు. పిల్లలు, యువకులకు వ్యక్తిగత శిక్షకుడి ద్వారా అందించే ఆలోచన-ఆధారిత ద్వారా ఈ సమస్యను పరిష్కరించొచ్చు అని అనుకున్నారు.

మరింత పరిశోధన చేసిన తరువాత, మన దేశంలో క్రీడా కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయని, దీనిని పరిష్కరించడానికి ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడానికి వర్చువల్ మోడల్ అయిన అప్ యుగోను స్టాపించాడు. 

"మేము పజల స్థాయిలో దీనిని ప్రారంభించాము, ఇందులో పిల్లలు ఈ సేవలను వారి ప్రాంగణంలో సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు. సంస్థ ఆరు నెలల క్రితం ఈ కార్యకలాపాలను ప్రారంభించింది, చాలా అద్భుతంగా కూడా పనిచేస్తోంది, ”అని గుప్తా అన్నారు.

  కరోనా వైరస్ మహమ్మారి భారతదేశానికి వ్యాపించినపుడు అంతా ఆగిపోయింది. ప్రారంభంలో ముఖ్య నగరాల్లో ఉన్న అపార్టుమెంటులు బయటివారికి ప్రవేశాన్ని నిరాకరించడంతో కంపెనీ తన సేవలను నిలిపివేయవలసి వచ్చింది. అప్ యు గో సంస్థ  ఇప్పటికే  డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లోకి ప్రవేశించింది.


ప్రస్తుత పరిస్థితుల్లో upugo.in టీమ్ ని గట్టిగా ఆలోచించేలా చేసింది.  మొదటి వారంలో కరోనా వైరస్ నెమ్మదిగా ఒక సంక్షోభంగా మారుతున్నప్పుడు వారు తమ మేక్-షిఫ్ట్ కార్యాలయంలో మూడు బంగారు సూత్రాలను అనుసరించారు. పరిస్థితులకు అనుగుణంగా  సంస్థ జట్టు ముందుకు వచ్చిన ఆలోచనలు ఇవి:


1. పరిస్థితిని అంగీకరించి, అభివృద్ధి వైపు ఉండే అవకాశాలు

ఈ బృందం  జీవన మనుగడ వైపు కాకుండా అభివృద్ధి వైపు ఉండే అవకాశాలపై ఆలోచించేల చేసింది. వారు తమ బ్లూప్రింట్‌ను డిజిటల్ ఆకృతిలో వేగవంతం చేయడం ద్వారా దీన్ని మరింత అభీవృద్ది చేశారు. కస్టమర్ల స్పర్శను కోల్పోకుండా ఉండటానికి ఇంటి వద్ద వర్కౌట్స్‌ పై దృష్టి పెట్టారు.

2. చురుకుదనం, మార్పు 

 "పిల్లలను ఆరుబయట తీసుకురావడానికి ప్రయత్నించడంలో ఎటువంటి ప్రయత్నం  మీరు చేయకపోయినా, వారు గాడ్జెట్లను ఉపయోగించుకునేలా, ఫిట్‌గా ఉండటానికి మేము 360 డిగ్రీలు ఫ్లిప్ చేయవలసి వచ్చింది" అని సంస్థ స్థాపకుడు అన్నారు. దీని వల్ల ప్రతిచోటా పిల్లలకు, మరీ ముఖ్యంగా వారు ఆనందించే ఆనందం చెక్కుచెదరకుండా ఉంటుంది.

3. అంతులేని అంలోచన విధానం

సానుకూల మనస్సు ఉన్నవారికీ అవకాశాలకు అంతు లేదు అని నమ్ముతారు. "మేము ఎక్కువగా ఆలోచించడం / విశ్లేషించడం లేదు మా నాస్సెన్సీని బట్టి మేము దీనిని చూశాము. కరోనా వైరస్ గందరగోళ సమయాల్లో వ్యాపారాలకు ఏమి జరుగుతుంది, చెడు నిర్ణయాల వల్ల కంపెనీలు మునిగిపోతాయి అలాగే  మంచి నిర్వహణ బృందాల నేతృత్వంలోని కంపెనీలు మనుగడ సాగిస్తాయి అని వ్యవస్థాపకుడు తెలిపారు.


"ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు. పిల్లలను ఫిట్ గా ఉంచడానికి మేము మరింత అన్వేషిస్తున్నాము. అలాగే అనేక ప్రత్యక్ష సెషన్‌లు, జూమ్ సెషన్‌లను నిర్వహించాము. మేము మా సోషల్ మీడియా ట్రాఫిక్ / సబ్ స్క్రిబర్స్/ వ్యూవర్స్ లో 300-400% పెరుగుదలను చూశాము.మా టీమ్ లేకుండా ఇదంతా సాధ్యం కాదు ”అని గుప్తా అన్నారు.


ప్రస్తుతం అప్‌యుగో  బెంగళూరు నగరానికి మాత్రమే పరిమితం చేశారు. అయితే, లాక్ డౌన్ ముగిసాక ఈ మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవాలనేది అమిత్ గుప్తా కోరిక.  ఇప్పుడు అప్‌యుగో తరగతులు ఉచితంగా అందిస్తున్నారు. ఈ సంస్థ జూమ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సెషన్లను నిర్వహిస్తోంది, వినియోగదారులందరితో మరింతా చేరువయ్యేందుకు ఈ సెషన్లను నిర్వహిస్తోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios