Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్ : 5 నిముషాల్లో ఎస్‌బి‌ఐ లోన్.. 6 నెలల వరకు నో ఈఎంఐ...

చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను తాకింది. భారతదేశంలో కరోనా వైరస్ లాక్‌డౌన్‌ ప్రభావం ఎక్కువగా మధ్యతరగతి ప్రజలపై చూపిస్తోంది. ఇలాంటి కష్టసమయంలో మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది.కరోనా వైరస్ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. 

sbi announces personal loan in five mins without no emi
Author
Hyderabad, First Published May 4, 2020, 3:09 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్ సోకి లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ దాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను తాకింది.

భారతదేశంలో కరోనా వైరస్ లాక్‌డౌన్‌ ప్రభావం ఎక్కువగా మధ్యతరగతి ప్రజలపై చూపిస్తోంది. ఇలాంటి కష్టసమయంలో మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది.కరోనా వైరస్ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అందుకని ఎస్‌బీఐ బ్యాంకు తమ కస్టమర్లకు శుభవార్త తెలిపింది.

వీరి కోసం ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ లేదా ఎమర్జెన్సీ లోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఎమర్జెన్సీ లోన్‌ కోసం ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా కేవలం 45 నిమిషాల్లో అందించనున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది.

ఈ ఎమర్జెన్సీ లోన్‌ పొందిన ఆరు నెలల తర్వాత దాని ఈఎంఐ పేమెంట్ మొదలవుతుంది. ఏ సమయంలోనైనా పర్సనల్ ఎమర్జెన్సీ లోన్‌ను తీసుకోవచ్చని ఎస్‌బీఐ చెప్పింది. కరోనా లాక్‌డౌన్ కాలంలో ఇబ్బంది పడుతోన్న ప్రజల కోసం దీన్ని తెచ్చినట్టు ఎస్‌బీఐ తెలిపింది.

ఈ ఎమర్జెన్సీ లోన్‌కు ఏడాదికి 7.25 శాతం వడ్డీ వేయనుంది. ఇది సాధారణంగా పర్సనల్‌ లోన్స్‌పై విధించే వడ్డీ కంటే చాలా తక్కువ. ప్రస్తుతం ఎస్‌బీఐ పర్సనల్‌ లోన్స్‌ 10.5 శాతం నుంచి 22 శాతం వరకు ఉన్నాయి.

ఈ లోన్ అసలు ఎలా పొందాలి, పొందడానికి ఎలాంటి అర్హత ఉండాలీ తెలుసుకోవడం కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి పీఏపీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, మీ అకౌంట్ నెంబర్ లోని  చివరి నాలుగు నెంబర్లు టైప్ చేసి, 567676కి ఎస్‌ఎంఎస్ చేయాలి. ఇలా ఎస్‌ఎంఎస్ పంపాక మీరు పర్సనల్ ఎమర్జెన్సీ లోన్‌కు అర్హులో కాదో బ్యాంక్ చెబుతుంది.

నాలుగు ప్రాసెస్‌లో అర్హులైన వారికి లోన్ వస్తుంది. యోనో ఎస్‌బీఐ యాప్‌లో కూడా అవైల్ నౌ అప్షన్లను క్లిక్ చేయాలి. ఆ తర్వాత లోన్ టెన్యూర్‌‌ను, అమౌంట్ సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్టర్ మొబైల్ నెంబర్‌‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌‌ చేస్తే మీ అకౌంట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ జమ అవుతుంది. మీరు లోన్ పొందటానికి మరే ఇతర దరఖస్థులు అవసరం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios