రిలయన్స్ రికార్డు బ్రేక్: మార్కెట్ ధర కంటే తక్కువకే పీపీఈ కిట్..

కరోనాపై పోరులో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది సేవలు అనన్య సామాన్యం. అదే సమయంలో కరోనారోగులకు చికిత్స టైంలో వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత పరిరక్షణ పరికరాలను చౌక ధరకే.. మార్కెట్ ధరలో మూడో వంతుకే అందుబాటులోకి తీసుకొస్తున్నది రిలయన్స్.
 

Reliance starts manufacturing 'affordable PPE' kits for frontline workers

ముంబై: కరోనాపై పోరులో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా భాగస్వామి అయ్యేందుకు మరో అడుగు ముందుకేసింది. మార్కెట్‌ ధరలో మూడో వంతుకే వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది వినియోగించే పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లను అందుబాటులోకి తెస్తున్నది‌.

దేశీయంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కిట్లకు దేశీయంగా భారీ డిమాండ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. అందుకే చైనా నుంచి ఒక్కోటి రూ.2 వేలకు భారత్‌ దిగుమతి చేసుకుంటున్నది. అయితే దీన్ని దాదాపు రూ.650కే రిలయన్స్‌ అందించనున్నది.

ఇందుకు గత ఏప్రిల్ నెలలో కొనుగోలు చేసిన తాము కొన్న వస్త్ర, దుస్తుల తయారీ సంస్థ అలోక్‌ ఇండస్ట్రీస్‌ను పీపీఈ తయారీ యూనిట్‌గా కూడా మార్చేసింది. గుజరాత్‌లోని సిల్వస్సాలోగల అలోక్‌ ఇండస్ట్రీస్‌ తయారీ ప్లాంట్లలో పీపీఈ కిట్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 

రోజుకు లక్షకుపైగా కిట్లను తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. పీపీఈ సూట్‌లో గ్లోవ్స్‌, షూ కవర్స్‌, ఎన్‌95 మాస్కులు, హెడ్‌గేర్‌, ముఖ కవచం ఉంటాయి. పీపీఈ కిట్ కోసం సమగ్ర టెక్నాలజీ, పెట్రో కెమికల్స్ ప్లాంట్లలోని ముడి సరుకుతో 10 వేల మంది టైలర్లు ఈ అలోక్ ఇండస్ట్రీస్‌ను రీ ఇంజినీరింగ్ చేశారు. అత్యున్నత నాణ్యతతో కూడిన పీపీఈ కిట్లను రిలయన్స్ తయారు చేస్తున్నది. 

also read  కరోనా ‘వ్యాక్సిన్’ కోసం నాలుగేళ్లు వెయింటింగ్ అనివార్యం: కిరణ్ మజుందార్‌షా

దేశంలో కరోనా ప్రభావం మొదలైన తర్వాతే జాతీయ కంపెనీలు పీపీఈ కిట్ల తయారీపై ద్రుష్టిని కేంద్రీకరించడం గమనార్హం. సమీప భవిష్యత్‌లో విదేశాలకు కూడా రిలయన్స్ పీపీఈ కిట్లను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. కానీ ప్రస్తుతానికి దేశీయంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఈ పీపీఈ కిట్లను తయారు చేయడంపై రిలయన్స్ కేంద్రీకరించింది.

మరోవైపు పెట్టుబడులను పెంచుకోవడానికి రైట్స్ ఇష్యూ జారీ చేసిన రిలయన్స్ తన వాటాటారులకు సలహాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఫేస్ బుక్ అనుబంధ వాట్సాప్ సంస్థతో కలిసి తొలి క్రుత్రిమ మేధ చాట్ చిట్ ను ఆవిష్కరించింది. రూ.53,125 కోట్ల మెగా రైట్స్ ఇష్యూపై రిలయన్స్ ఈ చిట్ చాట్‌లో రిలయన్స్ జవాబులిస్తుంది.

జియో హాప్టిక్ టెక్నాలజీస్ ఈ చిట్ చాట్‌ను అభివ్రుద్ధి చేసినట్లు రిలయన్స్ వర్గాలు తెలిపాయి. మదుపర్లకు తోడ్పాటునందించేందుకు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒక కంపెనీ క్రుత్రిమ మేధస్సు వినియోగించడం ఇదే మొదటిసారి. చిట్ చాట్‌లో ఇచ్చే సమాధానాలు ఇంగ్లిష్ భాషలో ఉంటాయి. 

ప్రశ్నలతో రూపొందించిన వీడియోలు మాత్రం ఆంగ్లం, హిందీ, మరాఠీ, కన్నడ, గుజరాతీ, బెంగాల్ భాషల్లో చూడోచ్చు. రిలయన్స్ సంస్థకు 26 లక్షల మంది వాటాదారులు ఉన్నారు. వాట్సాప్ సంస్థకు భారతదేశంలో 40 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ చాయంతో చిట్ చాట్ సేవలు పొందొచ్చు. 

+9179771 11111 నంబర్‌కు హాయ్ అని మెసేజీ పంపితే చిట్ చాట్ సేవల్ యాక్టివేట్ అవుతాయి. వెంటనే వీడియోలు, రైట్స్ ఇష్యూకు సంబంధించిన ప్రధాన తేదీలు, షేర్ హోల్డర్ ఎంటైటిల్మెంట్, భౌతిక షేర్ల ట్రేడింగ్ తదితరాలు కనిపిస్తాయి. మే 20న మొదలైన రిలయన్స్ రైట్స్ ఇష్యూ జూన్ మూడో తేదీతో ముగియనున్నది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios