Asianet News TeluguAsianet News Telugu

పేటీఎం సరికొత్త రికార్డు..దీంతో కేంద్రం సంక్షేమ పథకాలపై కొత్త నిర్ణయం..

ఆన్ లైన్ బ్యాంక్ పేటీఎం ఖాతాదారులు జమ చేసిన మొత్తం రూ.1000 కోట్లకు చేరుకున్నది. మరోవైపు పేటీఎం ద్వారా వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Paytm Payments Bank crosses Rs1,000 crore in savings account deposits, launches DBT scheme
Author
Hyderabad, First Published Apr 22, 2020, 3:55 PM IST

న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్ బ్యాంకు.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) తన వ్యాపార ప్రయాణంలో ఓ కొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు ఈ బ్యాంకుకు 57 మిలియన్లకు పైగా పొదుపు ఖాతాదారులు ఉన్నారు. 

పేటీఎం ఖాతాదారులు తమ ఖాతాల్లో జమ చేసిన డిపాజిట్ల విలువ మంగళవారం నాటికి రూ.1000 కోట్లు దాటిందపి పేటీఎం ప్రకటించింది. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా ప్రజలు ఎక్కువగా డిజిటల్ పేమేంట్లపై ఆధారపడుతున్నారని, దీనివల్ల తమ బ్యాంకులో డిపాజిట్లు చేసేవారి సంఖ్య భారీగా పెరిగిందని పేర్కొంది.

ఇకనుంచి తమ కస్టమర్లు 400కు పైగా ప్రభుత్వ రాయితీల ప్రయోజనాలను కూడా తమ బ్యాంకు లోని పొదుపు ఖాతాదారులకు అందించనున్నట్లు పీపీబీఎల్ తెలిపింది. ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ చెల్లింపులు, వృద్ధాప్య పెన్షన్, స్కాలర్‌షిప్‌ల వంటి వివిధ సాంఘిక సంక్షేమ పథకాల సబ్సిడీలను నేరుగా ఖాతాదారులకు బదిలీ చేసేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్ (డీబీటీ) ని పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.

పీపీబీఎల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సతీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ‘మా వినియోగదారులకు సులభమైన, అనుకూలమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాం. అంతేకాక మంది వినియోగదారులకు వినియోగదారులకు ప్రత్యక్ష సబ్సిడీ బదిలీలను అందిస్తున్నాం. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల ప్రజలకు అన్ని రకాల సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.

పేటీఎం అప్లికేషన్ ద్వారా డెరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) దరఖాస్తును నమోదు చేసి ఎంచుకోవచ్చు. అవసరమైన వివరాలు సమర్పించిన తర్వాత, అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి 2-3 రోజులు పడుతుంది. సబ్సిడీలను స్వీకరించడానికి ఖాతా లింకింగ్ కోసం ఎటువంటి ఛార్జీలు లేవు. వినియోగదారులు వారి బ్యాంకింగ్ స్టేటస్‌ను కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు.

రూ.9000 కోట్ల వరకు ఐటీ రీఫండ్స్
కరోనా నేపథ్యంలో ఐటీ శాఖ పన్ను రిఫండ్స్‌ను త్వరితం చేస్తోంది. ఈ నెల 8 నుంచి ఇప్పటి వరకు 14 లక్షల మందికి రూ.9,000 కోట్లకుపై రిఫండ్‌ చేసింది. ఈ రిఫండ్స్‌ అందుకున్న వారిలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులతో పాటు అవిభాజ్యం హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ప్రొప్రైయిటర్లు, కార్పొరేట్‌ సంస్థలు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలూ ఉన్నట్టు సీబీడీటీ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios