కరోనా కారణంగా చాలా మంది జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్ ప్రకటించటంతో రోజువారి కూలీలతో పాటు పేద కుటుంబాలు బిక్కుక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా ప్రయాత్నాలు చేస్తున్నా ఇంక పూర్తి స్థాయిలో అదుపులోకి రావటం లేదు. ప్రభుత్వాలు చేస్తున్న పోరాటలకు సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటి చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ వంతు సాయంగా విరాళాలలను ప్రకటించారు.

అయితే వారందరికీ సినీ  నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ కష్టకాలంతో ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా అభినందించాడు. ఈ సందర్భంగా ఆయన ట్వీటర్‌ లో వరుస పోస్ట్ చేశాడు. ముందుగా పెద్దన్నయ్య పెద్ద మనసు అంటూ సినీ కార్మికులకు కోటి రూపాయల విరాళమందించిన అన్నకు తన తరుపున ఇండస్ట్రీ కార్మికుల తరుపున కృతజ్ఞతలు తెలిపాడు.

తరువాత ట్వీట్ లో ప్రభాస్‌, మహేష్ బాబు, రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, నితిన్‌, సాయి ధరమ్‌ తేజ్ లను అభినందించాడు. సాయం చేసేందుకు ముందుకు వచ్చిన దర్శక నిర్మాతలు త్రివిక్రమ్‌ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్‌కు కూడా ధన్యవాదాలు తెలిపాడు. తన దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ విషయంలో ఉదారంగా వ్యవహరించిన ప్రకాష్ రాజ్‌, అల్లరి నరేష్‌, సతీష్‌ వేగేశ్నలను అభినందించాడు. అదే సమయంలో సినీ కార్మికుల కోసం కూరగాయలు, నిత్యావసర సరుకులు అందిస్తున్న హీరో రాజశేఖర్‌, నటుడు శివాజీ రాజాలకు అభినందలు తెలిపాడు.

ఈ కార్యక్రమాలకు నాంధిగా ముందుగా తానే భారీ విరాళాన్ని ప్రకటించాడు పవన్‌ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల తో పాటు కేంద్ర మంత్రి సహాయ నిధి కోటి రూపాయల చొప్పున మొత్తం 2 కోట్ల రూపాయల తనవంతుగా అందించాడు.