న్యూఢిల్లీ: 2021 జనాభా లెక్కలు మొదటి విడత, ఎన్‌పీఆర్ అప్ ‌డేట్ ను కేంద్రం వాయిదా వేస్తూ బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. కరోనా వైరస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.

కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా అడ్డుకొనేందుకుగాను కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ లోనే ప్రజలంతా ఉండాలని మోడీ ఈ నెల 24వ తేదీన కోరారు.

ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని కేంద్రం భావించింది. అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమాలను కేంద్రం వాయిదా వేసింది.

ఏప్రిల్-సెప్టెంబరులో గృహ జాబితా  గృహ గణనను ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుండి 28 వరకు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. జనాభా గణన - సెన్సస్ 2021 ను రెండు దశల్లో నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Also read:ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజటివ్

అస్సాం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభా 2021 మొదటి దశతో పాటు ఎన్ పీఆర్ నవీకరణ చేయాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించింది.ఇందులో భాగంగా ఎన్‌పీఆర్, జనాభా లెక్కల మొదటి దశ కార్యక్రమాలు ఈ ఏడాది ఏఫ్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ కార్యక్రమాలను వాయిదా వేసినట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ బుధవారం నాడు ప్రకటించింది.

జనాభా లెక్కలను దృష్టిలో ఉంచుకొని జనాభా లెక్కలను సేకరించేందుకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా  ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితులు లేనందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టుగా అధికారులు ప్రకటించారు.

ఎన్‌పీఆర్ ను పశ్చిమబెంగాల్, పంజాబ్, రాజస్థాన్, కేరళ ,ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే.