ముంబయి మురికి వాడలో కరోనా మరణం.. భవనం మూసివేత, హై అలర్ట్
సదరు వ్యక్తి ఇంట్లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా.. వారిని కూడా ఇంట్లోనే నిర్భంధించినట్లు అధికారులు చెప్పారు. వారికి గురువారం పరీక్షలు చేయనున్నారు. ఆ వ్యక్తి నివసించిన మొత్తం భవనాన్ని మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు పెరుగుతుండటం అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. కాగా.. తాజాగా ముంబయిలో మరో కరోనా కేసు నమోదైంది.
ఆసియాలో అతిపెద్ద స్లమ్ క్లస్టర్ అయిన ముంబైలోని ధారావిలో కరోనావైరస్ సోకి వ్యక్తి మృతి చెందాడు. . రోగిని బుధవారం సాయంత్రం సియోన్ ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Also Read కరోనా సోకినా వదలని టిక్ టాక్ పిచ్చి... వీడియో వైరల్...
కాగా.. సదరు వ్యక్తి ఇంట్లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా.. వారిని కూడా ఇంట్లోనే నిర్భంధించినట్లు అధికారులు చెప్పారు. వారికి గురువారం పరీక్షలు చేయనున్నారు. ఆ వ్యక్తి నివసించిన మొత్తం భవనాన్ని మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకు మహారాష్ట్ర్రలో 300 కరోనా కేసులు నమోదవ్వగా.. ఎక్కువ శాతం ముంబయిలోనే ఉండటం గమనార్హం. కాగా.. ముంబయి నగరంలోని ధారవి ప్రాంతంలో తొలి కరోనా మరణం నమోదవ్వడం అందరినీ కలవరపెడుతోంది. ఈ ప్రాంతలతో దాదాపు పది లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అది స్లమ్ ఏరియా కావడంతో.. చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అతి తక్కువ దూరంలో ప్రజలు నివసిస్తూ ఉంటారు. దీంతో.. ఎక్కువ మంది కి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని అధికారులు కంగారుపడుతున్నారు.
కాగా.. బుధవారం ఒక్క రోజే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో "హాట్‌స్పాట్" గా గుర్తించారు. 24 గంటల వ్యవధిలో యాభై తొమ్మిది మంది పాజిటివ్ పరీక్షించారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర్రలో 335మందికి కరోనా సోకగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు.