కరోనా అంటూ మహిళపై పాన్ ఉమ్మేసిన వ్యక్తి అరెస్టు
ఈశాన్య భారతదేశానికి చెందిన పాతికేళ్ల యువతిని కరోనా అంటూ వేధిస్తూ ఓ వ్యక్తి ఆమెపైకి పాన్ ఉమ్మేశాడు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: అనుచిత చర్యకుగాను పోలీసులు 40 ఏళ్ల వ్యక్తిపైకి పాన్ ను ఉమ్మేశాడు. ఈశాన్య భారతదేశానికి చెందిన మహిళను కరోనా అని వ్యాఖ్యానిస్తూ ఆమెపైకి పాన్ ఉమ్మేశాడు. ఈ సంఘటన ఢిల్లీలోని విజయనగర్ ప్రాంతంలో చేటు చేసుకుంది.
నిందితుడిని గౌరవ్ వోహ్రాగా గుర్తించినట్లు డీసీపీ విజయంత ఆర్యా చెప్పారు. ఈశాన్య భారతదేశానికి చెందినది కావడంతో మహిళను ఆ వ్యక్తి వేధించాడు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ఆ సంఘటన ఆదివారం రాత్రి 9.30 గంటలకు చోటు చేసుకుంది. ఆహార ధాన్యాలు కొనుగోలు చేయడానికి పాతికేళ్ల మహిళ తన ఇంటి నుంచి మిత్రురాలితో కలిసి బయటకు వచ్చింది. ఆ సమయంలో అతను పాన్ ఉమ్మేశాడు.
కోవిడ్ 19కు సంబంధం అంటగడుతూ ఈశాన్య భారతదేశానికి చెందినవారిని అవమానిస్తే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది.
జమ్మూ కాశ్మీర్ లో తొలి కరోనా మరణం సంభవించింది. జమ్మూ కాశ్మీర్ లోని హైదర్ పొరా గ్రామంలో 65 ఏళ్ల వ్యక్తి కరోనా వ్యాధితో మరణించాడు. అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు శ్రీగనర్ నలోని ఛాతీ సంబంధ వ్యాధుల ఆస్పత్రి వైద్యులు మూడు రోజుల క్రితం నిర్ధారించారు.
కరోనా మరణాన్ని శ్రీనగర్ మేయర్ జునైద్ అజీమ్ మట్టు ధ్రువీకరించారు. ట్విట్టర్ లో ఆయన దానిపై స్పందించారు. మృతుడితో సన్నిహితంగా మెలిగిన నలుగురు వ్యక్తులకు కూడా కరోనా సోకినట్లు బుధవారంనాడు తేలింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కోవిడ్ 19 వ్యాధిగ్రస్తుల సంఖ్య 11కు చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో 664 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 128 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానం 118తో రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, తెలంగాణ ఆ తర్వాత వరుస స్థానాలను అక్రమించాయి.