దేశంలో కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరుగుతోంది. లాక్ డౌన్ విధించినప్పటికీ.. కేసులు మాత్రం తగ్గడం లేదు. ఈ ప్రభావం మహారాష్ట్ర్రలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా అక్కడ మరో ఐదుకేసులు నమోదయ్యాయి. దాంతో కలిసి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 300 దాటాయి. 

మంగళవారం  ఒక్కరోజే రాష్ట్రంలో 72 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసులు సంఖ్య పెరిగినట్లు మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ కేసుల్లో ఒక్క ముంబై నగరంలోనే 59 నమోదయ్యాయట. మొత్తం పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు.

Also Read దేశానికి నిజాముద్దీన్ గండం.. ఢిల్లీకి వెళ్లివచ్చిన వారి ఆచూకీ కోసం.....

 ఇక నాగర్‌లో మూడు.. పూణె, థానె, కళ్యాన్-దోంబిలి, నవీ ముంబై, వాశి, విరార్‌లలో రెండు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. కాగా రాష్ట్రంలో కరోనా వల్ల ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికర డేటా వెల్లడిస్తోంది.

సోమవారం దాదాపు 4,538మందిని క్వారంటైన్ కి తరలించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అనుమానితులకు కరోనా పరీక్షలు చేయగా.. వారిలో 3,876మందికి కరోనా  నెగిటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు. 230మందికి మాత్రం పాజిటివ్ వచ్చిందన్నారు.