మహారాష్ట్రలో వెయ్యి దాటిన కరోనా కేసులు..64మరణాలు
ఒక్క ముంబై నగరంలోనే 590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబై తర్వాత పుణెలో అత్యధిక కేసులు వెలుగుచూస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యి దాటడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. కాగా.. దీని ప్రభావం మహారాష్ట్రలో మరింత ఎక్కువగా కనపడుతోంది. రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి.
వందల సంఖ్యలో కరోనా బాధితులతో మహారాష్ట్ర అల్లాడిపోతోంది. గడచిన 24 గంటల్లో 150 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,018కు చేరింది.
ఒక్క ముంబై నగరంలోనే 590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబై తర్వాత పుణెలో అత్యధిక కేసులు వెలుగుచూస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యి దాటడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్‌డౌన్ పొడిగింపునకు విజ్ఞప్తి చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ప్రాంతాల వారీగా నమోదైన కేసులివి...
గత 24 గంటల్లో మహారాష్ట్రలో నమోదైన కరోనా కేసులు-150
ముంబై- 116
పుణె-18
నగర్-3
బుల్ధన-2
థానే-2
నాగ్‌పూర్-3
సతారా-1
రత్నగిరి-1
ఆబాద్-3
సంగ్లి-1