దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత: రాష్ట్రాల సీఎంలకు మోడీ జాగ్రత్తలు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశంలో విధించిన లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేయనున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Lock down will be lifted in phased manner: PM video conference with CMs

న్యూఢిల్లీ: దేశంలో లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాన్ని దశలవారీగా ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. 

గత 24 గంటల్లో దేశంలో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 12 మంది మరణించారని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 1965 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు, మొత్తం 50 మంది మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రకటించారు. 

మర్కజ్ లో పాల్గొన్న 400 మందికి కరోనా వైరస్ సోకిందని, మర్కజ్ లో పాల్గొన్న 9 వేల మందిని గుర్తించామని, ఇందులో 1300 మంది విదేశీయులున్నారని, వారందంరినీ క్వారంటైన్ కు తరలించామని అధికారులు చెప్పారు.  మర్కజ్ లో పాల్గొన్నవారు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారున్నట్లు తెలిపారు. 

ఇదిలావుంటే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. లాక్ డౌన్ ఎత్తివేత సందర్బంగా ప్రజలు ఒకేసారి పెద్ద యెత్తున బయటకు రాకుండా చూడాలని ప్రధాని సూచించారు. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఆయన సీఎంలతో చర్చించారు. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఆయన సూచించారు 

డాక్టర్లను, వైద్య సిబ్బందిని పెంచుకోవాలని ఆయన సీఎంలకు సూచించారు. ప్రతి జిల్లాలో నిఘా అధికారులను నియమించాలని ఆనయ చెప్పారు. లాక్ డౌన్ తర్వాత మునుపటిలాగా సాధారణంగా ఉండడానికి లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. హాట్ స్పాట్స్ ను గురించి, వాటిని చుట్టుముట్టాలని ఆయన చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios