Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్ : కోటక్ మహీంద్ర ఉద్యోగుల వేతనాలలో కోత...

కరోనా వైరస్ సంక్షోభం ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపుతుందని, అనేక కార్పొరేట్లు వారి జీతాలలో కోతను స్వచ్ఛందంగా అందించారు. భారతదేశంలో నిరుద్యోగత రేటు మే 3 వరకు వారంలో 27 శాతానికి చేరిందని థింక్ ట్యాంక్ సిఎంఐఇ తెలిపింది.
 

Kotak Mahindra Bank has decided on a 10 per cent pay cut for the employees earning above Rs 25 lakh per annum
Author
Hyderabad, First Published May 8, 2020, 1:15 PM IST

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి వల్ల  ప్రైవేటు రంగ రుణదాత కోటక్ మహీంద్రా బ్యాంక్ సంవత్సరానికి రూ .25 లక్షలకు పైగా సంపాదించే ఉద్యోగుల వేతనల్లో 10 శాతం కోత విధించినట్లు తెలిపింది. సీటీసీలో 10 శాతం తగ్గింపును నిర్ణయించామని, 2020,మే - 2021, మే నెల వరకు ఈ నిర్ణయం అమల్లో వుంటుందని  బ్యాంకు  ఒక నోటీసులో  తెలిపింది.

బ్యాంకుకు చెందిన టాప్ మేనేజ్ మెంట్ 2020-21 సంవత్సరానికి తమ జీతాల్లో 15 శాతం కోతను స్వచ్ఛందంగా  ప్రకటించిన కొన్ని వారాల తరువాత  తాజా నిర్ణయం  వెలుగులోకి వచ్చింది.  

also read  18 ఏళ్ల కుర్రాడితో రతన్ టాటా బిజినెస్.. ఫార్మా స్టార్టప్‌లో పెట్టుబడులు..


కరోనా వైరస్ సంక్షోభం ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపుతుందని, అనేక కార్పొరేట్లు వారి జీతాలలో కోతను స్వచ్ఛందంగా అందించారు. భారతదేశంలో నిరుద్యోగత రేటు మే 3 వరకు వారంలో 27 శాతానికి చేరిందని థింక్ ట్యాంక్ సిఎంఐఇ తెలిపింది.

కరోనా వైరస్ విస్తృతి ప్రారంభంలో 2-3 నెలల విషయంగా కనిపించినా, క్రమేణా మహమ్మారిగా విజృంభించడంతో జీవితాలు, జీవనోపాధి రెండింటిపై తీవ్ర ప్రభావాన్ని చూపిందనీ, మరీ ముఖ్యంగా ఇప్పట్లో కనుమరుగయ్యే సూచనలేవీ లేవని స్పష్టంగా తెలుస్తుందని కోటక్ గ్రూప్ హెచ్ ఆర్ ముఖ్య అధికారి సుఖ్జిత్ ఎస్ పస్రిచా ఉద్యోగుల నోట్‌లో పేర్కొన్నారు.

కాగా కోటక్ మహీంద్ర గ్రూపు పీఎం కేర్స్ పండ్ తో పాటు,  మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios