కేరళలో తొలి కరోనా మరణం: రాష్ట్రాలవారీగా మృతుల సంఖ్య
కేరళలో తొలి కరోనా మరణం సంభవించింది.. కొచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 69 ఏళ్ల వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. దీంతో దేశంలో కరోనా వైరస్ బారినపడి మరణించినవారి సంఖ్య 20కి చేరుకుంది.
న్యూఢిల్లీ: కేరళలో తొలి మరణం నమోదైంది. కేరళలోని కొచ్చి ఆస్పత్రిలో 69 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. కేరళలో అత్యధికంగా 176 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో తొలి కరోనా కేసు కూడా కేరళలోనే నమోదైంది. దీంతో భారతదేశంలో కరోనా మరణాల సంఖ్య 20కి పెరిగింది.
రాష్ట్రాలవారీగా కరోనా మరణాల సంఖ్య ఇలా ఉంది....
కేరళ 1
మహారాష్ట్ర 4
కర్ణాటక 3
గుజారత్ 3
ఢిల్లీ 1
తమిళనాడు 1
పంజాబ్ 1
మధ్యప్రదేశ్ 2
జమ్మూ కాశ్మీర్ 1
పశ్చిమ బెంగాల్ 1
చండి గడ్ 1
హిమాచల్ ప్రదేశ్ 1
మొత్తం 20
రాష్ట్రాలవారీగా కరోనా కేసుల సంఖ్య
మొత్తం కేసులు 906
కేరళ 176
మహారాష్ట్ర 162
కర్ణాటక 64
తెలంగాణ 59
గుజరాత్ 54
రాజస్థాన్ 50
ఉత్తరప్రదేశ్ 50
ఢిల్లీ 40
తమిళనాడు 40
పంజాబ్ 38
హర్యానా 33
మధ్యప్రదేశ్ 33
జమ్మూ కాశ్మీర్ 20
పశ్చిమ బెంగాల్ 15
ఆంధ్రప్రదేశ్ 13
లడక్ 13
బీహార్ 9
చండీగడ్ 8
అండమాన్ నికోబార్ 6
చత్తీస్ గడ్ 6
ఉత్తరాఖండ్ 5
గోవా 3
హిమాచల్ ప్రదేశ్ 3
ఒడిశా 3
మణిపూర్ 1
మిజోరం 1
పుదుచ్చేరి 1
ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ృ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది.