లాక్ డౌన్... ఆంధ్రప్రదేశ్ లో ఇరుక్కున్న కర్ణాటక విద్యార్థులు

కర్నూలు జిల్లా నంద్యాలలో వివిధ పోటీ పరీక్షల నిమిత్తం కర్ణాటకలోని పలు జిల్లాలకు చెందిన వందలాది మంది శిక్షణ తీసుకుంటున్నారు. కాగా.. ఈ క్రమంలో లాక్ డౌన్ ప్రకటించగా.. వారంతా నంద్యాలలోనే ఇరుక్కుపోయారు.

Karnataka based students faces problems in  nandyala in Andhrapradesh over India Lock down

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా... ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటకకు చెందిన విద్యార్థులు ఇరుక్కుపోయారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో వివిధ పోటీ పరీక్షల నిమిత్తం కర్ణాటకలోని పలు జిల్లాలకు చెందిన వందలాది మంది శిక్షణ తీసుకుంటున్నారు. కాగా.. ఈ క్రమంలో లాక్ డౌన్ ప్రకటించగా.. వారంతా నంద్యాలలోనే ఇరుక్కుపోయారు.

Also Read కరోనాతో గుజరాత్‌లో 45 ఏళ్ల మహిళ మృతి: ఆరుకు చేరిన మృతుల సంఖ్య...

కాగా... ఆ విద్యార్థుందరినీ క్షేమంగా రాష్ట్రాని తీసుకురావడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నంద్యాలలో విద్యార్థులు అవస్థలు  పడుతున్నారంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర అధికారులు విద్యార్థులను స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

కాగా, నంద్యాల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులు, హాస్టళ్లలో, అద్దె గదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటుంటారు. కరోనా భయాలతో వీరిని ఇళ్లు, హాస్టళ్లు ఖాళీ చేయమంటున్నారన్న వార్తలు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనను పెంచాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కార్యాలయం కల్పించుకొని విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios