ఐదో సారి కూడా పాజిటివే.. ఆందోళనలో కనికా కుటుంబం
గాయని కనికా కపూర్‌కు నిర్వహించిన కరోనా టెస్ట్ లో మరోసారి పాజిటివ్ వచ్చింది. వరుసగా ఐదోసారి కూడా టెస్ట్ లలో పాజిటివ్ రావటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ గాయని కనికా కపూర్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలుతున్న సమయంలో విదేశాల నుంచి వచ్చిన కనికా, తరువాత పలు పార్టీలో పాల్గొనటం ఆ పార్టీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనటంలో అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో ఆమె మీద క్రిమినల్ కేసును కూడా నమోద చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తోంది.
కరోనా పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తులకు ప్రతీ 48 గంటలకు ఒకసారి టెస్ట్ లు నిర్వహిస్తారు. ప్రస్తుతం సంజయ్ గాంథీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్న ఆమెకు సోమవారం ఐదోసారి టెస్ట్ లు నిర్వహించారు. అయితే ఈ టెస్ట్ లలో కూడా ఆమెకు పాజిటివ్ రావటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ఇన్సిస్టిట్యూట్ డైరెక్టర్ ఆర్కే ధిమాన్ గాయని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. కుటుంబ సభ్యులు ఆంధోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే పెద్ద సంఖ్యలు పాజిటివ్ కేసులు నమోదు కావటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నారు అధికారులు.