Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ సమయంలో జియో ఫైబర్ డబుల్ ధమాకా డేటా ఆఫర్...

లాక్ డౌన్ వేళ రిలయన్స్ జియో ఫైబర్ తన వినియోగదారులకు రూ.199పై డబుల్ డేటా ఆఫర్ అందిస్తున్నది. ఇది లాక్ డౌన్ వేళ దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోం కింద పని చేసే వారికి వర్తిస్తుంది.
JioFiber Combo Plan Rs. 199 Offers 1TB Data Can Double As An Add-On
Author
Hyderabad, First Published Apr 13, 2020, 2:36 PM IST
న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో  డేటా వినియోగం బాగా పెరిగింది. దాదాపుగా ఐటీ ఉద్యోగులతోపాటు ఇతర రంగాల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో డేటా వినియోగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జియో ఫైబర్ తన యూజర్లందరికీ అన్ని ప్లాన్లలోనూ డబుల్ డేటాను ఆఫర్ చేస్తోంది. 

4జీ ప్లాన్ సబ్ స్క్రైబర్లందరికీ కనిష్టంగా రూ.699లకు 100 ఎంబీపీఎస్ డేటా పొందే వారికి డబుల్ డేటా అందజేస్తోంది. రూ.199 విలువైన ఈ ప్లాన్ కింద ఒక టిగా బైట్ డేటా వారం పాటు అందించనున్నది. తమ ఖాతాదారులు హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్‌తో అనుసంధానమయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జియో ఫైబర్ చెప్పింది. 

ఈ ప్లాన్‌ను తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో అత్యుత్తమ సేవలందిస్తున్నట్టు పేర్కొంది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కోదాడ, మహబూబ్ నగర్, నల్గొండలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో హై-స్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలను అందించేందుకు జియో ఫైబర్ తన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచింది.

రాష్ట్రంలో దశల వారీగా జియో ఫైబర్ హై స్పీడ్ బ్రాడ్ బాండ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో మరిన్ని నగరాలకు జియో ఫైబర్ సేవలు విస్తరించనున్నట్టు ప్రకటించింది.

also read  లాక్ డౌన్ ఎఫెక్ట్: భారీగా పడిపోయాయిన ఆన్ లైన్ అమ్మకాలు...కానీ ?

స్టే కనెక్టెడ్, స్టే ప్రొడక్టివ్‌లో భాగంగా జియో ఫైబర్ తన యూజర్లకు డబుల్ డేటా ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది. కొత్త యూజర్లకు 10 ఎంబీపీఎస్ స్పీడ్, 100 జీబీ డేటాతో ఉచిత కనెక్టివిటీ ఇస్తోంది. 

చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కోదాడ, మహబూబ్ నగర్, నల్గగొండలలో జియో ఫైబర్ తన హై స్పీడ్ బ్రాడ్ బాండ్ స్పీడ్‌ను ఒక గిగా ఫైబర్ దాకా పెంచింది.

ఇంటి నుంచి పని చేస్తున్నవారికి హై స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడం ద్వారా మద్దతుగా నిలవాలని కంపెనీ భావిస్తోందని జియోఫైబర్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉన్న పట్టణాలతోపాటు ఇతర ప్రధాన పట్టణాలకు ఈ సేవలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. 
Follow Us:
Download App:
  • android
  • ios