ఐటీ రంగంలో కొత్త నియామకాలు అనుమానమే: తేల్చేసిన ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ...

ఈ ఏడాది ఐటీ రంగంలో పెద్దగా నియామకాలు ఉండకపోవచ్చునని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. రూ.75 వేల పై చిలుకు వేతనదారులకు మాత్రం శాలరీల్లో కోత తప్పక పోవచ్చునని చెప్పారు.
 

IT services companies to suspend hiring this year: Mohandas Pai

బెంగళూరు: కరోనా మహమ్మారి స్రుష్టిస్తున్న విలయం మధ్య భారత ఐటీ కంపెనీలు ఈ ఏడాది కొత్త నియామకాలేవీ చేపట్టకపోవచ్చని ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ అన్నారు. అలాగే కోవిడ్‌-19 ప్రభావం కారణంగా ఏర్పడిన కష్టాలను దృష్టిలో ఉంచుకుని సీనియర్‌ సిబ్బంది వేతనాల్లో కూడా 20-25 శాతం కోత కూడా పడిందన్నారు. 

అయితే వేతనాల కోత రూ.75,000 పైబడిన జీతాలున్న వారికే తప్ప అంతకన్నా తక్కువ వేతనాలు ఉన్న వారికి ఎలాంటి కోత లేదని ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ అవరోధాలు, సామాజిక దూరం పాటించాలన్న నిబంధనల కారణంగా కార్యాలయాల్లో పని చేయడానికి ఏర్పడిన ఇబ్బందిని ఐటీ రంగం ఎంతో సమర్థవంతంగా అధిగమించగలిగిందని చెప్పారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ఐటీ సంస్థలు తమ క్లయింట్ల వద్ద అనుమతులు తీసుకుని 90 శాతం మంది సిబ్బంది ఇంటి నుంచే పని చేయడానికి వీలు కల్పించాయని ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు. రాబోయే ఏడాది కాలంలో ఐటీ కంపెనీలకు కార్యాలయ వసతి డిమాండు పెద్దగా ఉండకపోవచ్చునని అన్నారు. 

also read ఆర్‌బి‌ఐ షాకింగ్ న్యూస్: రూ.68 వేల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ..

కరోనా వ్యాప్తిని నివారించడానికి భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉంటుందని మోహన్ దాస్ పాయ్ తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్నందున ఇబ్బంది లేదన్నారు. సాధారణ సమయంలో రొటేషనల్‌గా 25 శాతం మంది ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించడం వల్ల అదనపు స్పేస్ లభిస్తుందన్నారు. వచ్చే ఏడాది కల్లా పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని తెలిపారు.

అలాగే ఐటీ కంపెనీలు ఇప్పటివరకు ప్రకటించిన నియామక కట్టుబాట్లు గౌరవిస్తూ ఎవరైనా ఉద్యోగం మానేస్తే వారి స్థానంలో కొత్త నియామకాలు కూడా చేపట్టకపోవచ్చునని మోహన్ దాస్ పాయ్‌ చెప్పారు. ఈ పరిస్థితి ప్రస్తుత త్రైమాసికంతోపాటు వచ్చే త్రైమాసికంలోనూ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఆయన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అరిన్ క్యాపిటల్ అండ్ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 

ఇంతకుముందు రొటేషన్ పద్దతిలో ఐటీ కంపెనీల్లో 25 శాతం నుంచి 30 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేవారని మోహన్ దాస్ పాయ్ గుర్తు చేశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఐటీ సిబ్బంది ఇంటి వద్ద నుంచే పని చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. 2025 నాటికి తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పని చేయిస్తామని టీసీఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios